AYUSHMAN BHARAT CARD REGISTRATION CARD DISTRIBUTION PROCESS


భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనేది హెల్త్ స్కీమ్. 2018 ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది 

ఆయుష్ మాన్ భారత్ హెల్త్ కార్డ్ డౌన్లోడ్  రిజిస్టర్ చేయుటకు వాలంటీర్స్ కి మాత్రమే ప్రొవిజన్ ఇవ్వబడడం జరిగింది   మీరు  వాలంటీర్ గా జాయిన్ అయినపుడు  ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయ్యిందో  ఆ నెంబర్ ఎంటర్ చేస్తే వారికి లాగిన్ అవ్వటం  జరుగుతుంది 

 

New Update ::
ఆయుష్మాన్ భారత్ 2.0 వెర్షన్ నందు Mobile OTP, Face, తో పాటుగా Finger Auth అనే ఆప్షన్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఆ ఆప్షన్ ద్వారా బయోమెట్రిక్ ఉపయోగించి eKYC పూర్తి చెయ్యవచు. అందరూ గమనించగలరు

Ayushman Bharath App 2.0 Click here


☞︎︎︎ ఆయుష్మాన్ భారత్ కార్డులను రిజిస్టర్  చేయడానికి అక్టోబర్ 5వ తారీకు లోపు లబ్ధిదారులను వాలంటీర్లు రిజిస్టర్ చేయవలసి ఉంటుంది   వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ యాప్ ను మరియు ఆధార్ ఫేస్ ఆర్.డి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది 

 

☞︎︎︎ యూజర్ మాన్యువల్ లో పేర్కొన్న లింక్ నుంచి ముందుగా లబ్ధిదారుల జాబితాను  డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది. లేదా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా  జాబితాను పొందవచ్చు 

☞︎︎︎ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండాలన్న నిబంధన ఏమి  లేదు. సెక్ (SECC) డేటా ప్రకారం రూపొందిన లబ్ధిదారుల డేటా  ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

☞︎︎︎ మొత్తం ఎంత మంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి విడివిడిగా ఆయుష్మాన్ భారత్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది.

☞︎︎︎ ఒకవేళ ఒక వాలింటర్ కు వేరే క్లస్టర్ నందు ఇంచార్జి  బాధ్యతలు నిర్వర్తిస్తున్నపుడు, మొదటిగా లాగిన్ అయిన దాని నుంచే వేరే క్లస్టర్ లబ్ధిదారులను కూడా  రిజిస్టర్ చేయవచ్చును

☞︎︎︎ వాలింటర్  లాగిన్ అయిన తర్వాత లబ్ధిదారులను సెర్చ్ చేసేటప్పుడు లబ్ధిదారుల జాబితాలో ఉన్న యు.హెచ్.ఐ.డి యూనివర్సల్ హెల్త్ ఐడి ని  గుర్తించి ఎంటర్ చేస్తే  దానిని యాప్ లో ఫ్యామిలీ ఐ.డి గా నమోదు చేసి సెర్చ్ చేస్తే, కుటుంబ సభ్యుల వివరాలన్నీ కనబడతాయి.

☞︎︎︎ ఒకవేళ వాలంటీర్ కుటుంబాన్ని సందర్శించినప్పుడు కుటుంబ సభ్యులలో కొందరు  లేకపోతే, ఎంత మంది ఉంటే అంత మంది లబ్ధిదారులను రిజిస్టర్ చేసి, తర్వాత  మిగతా సభ్యులను కవర్ చేసే అవకాశం ఉంది

☞︎︎︎ మీ  మొబైల్ ఆండ్రాయిడ్ వెర్షన్  తప్పనిసరిగా 9 లేదా అంతకన్నా ఎక్కువ వెర్షన్ ఉండాలి ఫస్ట్  మీరు మీ మొబైల్ ఫోన్లో ''ఆయుష్మాన్ భారత్ మొబైల్ అప్లికేషన్'' మరియు ''ఆధార్ ఫేస్ ఐడి'' అనే మొబైల్ అప్లికేషన్ లు ఇన్స్టాల్చే చేసుకోవాలి 

☞︎︎︎ తర్వాత  ఆయుష్మాన్ భారత్ మొబైల్  అప్లికేషన్ లో "NHA Data Privacy Policy" విధానానికి ''ACCEPT'' పై క్లిక్ చేయాలి. వెంటనే వచ్చిన అప్లికేషన్ HOME PAGE లో LOGIN ను CLICK చేసి SELECT LANGUAGE వద్ద భాషను సెలెక్ట్ చేసుకోవాలి. లాగిన్ యాప్ వద్ద  మీరు OPERATOR అని సెలెక్ట్ చేసుకొని మీ రిజిస్టర్ అయినా మొబైల్ నెంబర్  ఎంటర్ చేసి NEXT పై క్లిక్ చేయాలి. తర్వాత వచ్చిన ఆరు అంకెల OTP ఎంటర్ చేసి NEXT పై క్లిక్ చేయాలి


☞︎︎︎ ఒకవేళ వాలంటీర్  మొబైల్ నెంబర్ తో OPERATOR గా రిజిస్టర్ అవ్వడానికి వీలు కానీ  పక్షంలో మీ డిజిటల్ అసిస్టెంట్ లేదా పంచాయతీ వార్డు సెక్రటరీ లాగిన్ ద్వారా మీరు  మీ మొబైల్ నెంబర్ను మార్చుకోవాల్సి ఉంటుంది . తర్వాత  ఇప్పుడు మీరు గుర్తుండే  ఒక నాలుగు అంకెల PIN  ను ఎంటర్ చేయాలి. మీరు  ఈ నాలుగు అంకెల PIN నెంబర్ ఉపయోగించి మాత్రమే మీరు ఎప్పుడూ ఈ యాప్ లాగిన్ అయ్యి   వాడగలుగుతారు కావున మీరు ఈ పిన్ను గుర్తు ఉండేలా ఒక నాలుగు అంకెల నెంబర్ను ఉంచవలసిందిగా మనవి. ఇక్కడితో ఆపరేటర్ గా మీరు నమోదు అవ్వటం జరుగుతుంది 



ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డును రెండు రకాలుగా రిజిస్టర్  చెయ్యవచ్చు


1. ఆధార్ UHID ద్వారా లబ్ధిదారులను గుర్తించి (Search by ID)


2. వారి జిల్లా, మండలం, సచివాలయం, మరియు  క్లస్టర్ (Search By Village / Town)


ఆధార్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి (Search by ID):


మీకు  క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా మీ క్లస్టర్ ఐడి తో ఉన్న ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల వివరాలు డౌన్ లోడ్ చేసుకొని వివరాలు  పొందవచ్చు.

 

 

తర్వాత  వారి ఆధార్ ను ఉపయోగించి మీరు (Search By ID) నుండి వారిని  నమోదు చేయవచ్చు నమోదు చేయవలసిన లబ్ధిదారుని ఆధార్ ఎంటర్ చేయగానే వారి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు వస్తాయి.

 

అందులో మీరు నమోదు చేసే వ్యక్తిని మీరు ఎంచుకొని ఆ వ్యక్తి వివరాల వద్ద ఉన్న AUTHENTICATE అనే BUTTON ను క్లిక్ చేసి నమోదు చేసే లబ్ధిదారుని ఆధార్ కు అతని ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో  లేదో కనుక్కొని Authorization Type లో MOBILE OTP  లేదా FACE AUTHENTICATION ను ఎంచుకోవాలి


FACE AUTHENTICATION


FACE AUTHENTICATION  అనే ఆప్షన్  ఎంచుకుంటే  క్రింద తెలిపిన ఐదు విషయాలు మీరు పాటించవలసి ఉంటుంది:


1. మీరు లబ్ధిదారుని మీ ఫోను ఎదురుగా ఉండవలసి ఉంటుంది మీ ఫోన్ లో సెల్ఫీ కెమెరా ఆన్ చేయరాదు

2. మీ ఫోనుకు మరియు లబ్ధిదారునికి మధ్య కనీసం ఒక అడుగు దూరం ఉండేలా చూసుకోవాలి అంతకుమించి  తక్కువ ఉన్న లేదా ఎక్కువ ఉన్నా కెమెరా సరిగా  ఆ వ్యక్తిని గుర్తించకపోవచ్చు


3 లబ్ధిదారుని మీద సరిపడే అంత వెలుతురు పడేలా చూసుకోవాలి.

4  ఈ పేస్ ద్వారా చేసే పద్ధతిలో లబ్ధిదారుడు కనీసం రెండు లేదా మూడుసార్లు కనురెప్పలు ఆడించవలసి  ఉంటుంది

5  మీరు మీ మొబైల్ ఫోన్ను మరియు లబ్ధిదారునికి వీలైనంతవరకు కదలకుండా ఉండేటట్లు  చూసుకోవాలి 

 

 మొబైల్ ఫోను మరియు లబ్ధిదారులు ఎదురెదురుగా ఉండేటట్లు  చూసుకోవాలి. ఆకుపచ్చ రంగులో ✅ Tick వచ్చి Image Successfully Captured అని వస్తే లబ్ధిదారుని ఫేస్ ద్వారా గుర్తించే ప్రక్రియ పూర్తి అయ్యినట్లు . ఒకవేళ క్రింద  చూపిన ఎర్ర రంగులో ❌ సంబల్ వచ్చినచో మళ్ళీ Face Authentication గుర్తించే ప్రక్రియ పైన తెలిపిన విధంగా  మీరు మళ్లీ చేయవలసి ఉంటుంది 

 

మీరు  MOBILE OTP ఎంచుకుంటే లబ్ధిదారునికి వచ్చిన OTP ను ఎంటర్ చేసి నమోదు చేయాలి. ఇప్పుడు పైన తెలిపిన విధంగా మొబైల్ నెంబర్ ను నమోదు చేసి వచ్చిన OTP మళ్ళీ ఎంటర్ చేసి ఫోటో తీసి SUBMIT క్లిక్ చేసి నమోదు ముగించవల్సి ఉంటుంది .ఇక్కడితో eKYC ద్వారా గుర్తించే విధానం పూర్తిఅయ్యినట్లు 

 

ఇప్పుడు లబ్ధిదారుని మొబైల్ నెంబర్  ఎంటర్ చేసి దానికి వచ్చిన OTP ఎంటర్ చేసి TAKE PHOTO అని క్లిక్ చేయాలి లబ్ధిదారుని ఫోటోని తీయవల్సి  ఉంటుంది ఒకవేళ ఫోటో సరిగ్గా బాగా  రాకపోతే సరిగా వచ్చేలా మరోసారి ఫోటో తీయాలి ఆ తరువాత రాష్ట్రం జిల్లా మండలం గ్రామం ఎంచుకోవాలి.తరువాత Terms & Conditions అనే చెక్ బాక్స్ ను Tick చేసి Submit BUTTON ను క్లిక్ చేయాలి

 

తర్వాత  లబ్ధిదారుని క్రింద చూపిన విధంగా చాతి పైన వరకు మాత్రమే  PASSPORT SIZE ఫోటో మాత్రమే తీయాలి

 

ఒకవేళ మీరు పొందు పరిచిన  వివరాలు ఆధార్ తో సరిపడే ఉంటే AUTO APPROVAL పద్ధతి ద్వారా కార్డు వెంటనే జనరేట్ అవ్వటం జరుగుతుంది . ఏ లబ్ధిదారుల వివరాలైతే ఆధార్ తో  వివరాలతో సరిపోలేదు ఈ కేవైసీ అయిన ఆ లబ్ధిదారుల వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్   వారి ఆమోదం కోసం పంపడం జరుగుతుంది ట్రస్ట్ వారు ఆమోదించిన తర్వాత మాత్రమే వారికి కార్డు జనరేట్ అవ్వటం జరుగుతుంది 

 

సచివాలయానికి చెందిన ANM, మరియు వాలంటీర్ల ద్వారా ఆ సచివాలయ పరిధిలో గుర్తించబడిన అన్ని కుటుంబాల నమోదు అయ్యే విధంగా పర్యవేక్షిస్తారు. AUTO APPROVAL అయిన లబ్ధిదారులకు ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ PVC హెల్త్ కార్డు ప్రింటింగ్ కి పంపడం జరుగుతుంది . ప్రింట్ అయిన ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ PVC హెల్త్ కార్డులను సచివాలయంలోని ANM లకు అందజెయ్యడం  జరుగుతుంది. వాటిని పైన తెలిపిన విధంగా సదరు వాలంటీర్ కు పంపిణీ చేయించే బాధ్యత ANM  వారి ఫై ఉంటుంది


2. రాష్ట్రం జిల్లా మండలం సచివాలయం క్లస్టర్ (Search By Village / Town ) :


State (రాష్ట్రము) : ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకొని

తర్వాత District (జిల్లా) : మీ జిల్లా

తర్వాత Block (మండలం) : మీ మండలం

తర్వాత Village ( సచివాలయం) : మీ సచివాలయం

తర్వాత Cluster (క్లస్టర్) మీ వాలంటీర్  క్లస్టర్ 

 

 ఎంచుకొని 'View List' నొక్కిన వెంటనే ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల వివరాలు  అన్నిరావటం జరుగుతుంది . అందులో మీరు పేరు ద్వారా లబ్ధిదారుని వెతికే అవకాశం  ఉండటం వల్ల మీరు నమోదు చేయబోయే లబ్ధిదారుని ఆ లిస్టు నుండి  వెంటనే  మీరు ఎంచుకోవచ్చు అందులో మీరు నమోదు చేసే లబ్ధిదారును ఎంచుకొని పైన తెలిపిన Mobile OTP లేదా Face Authentication ప్రక్రియ ద్వారా  మీరు ఈ కేవైసీ చేసే నమోదు చేయవలసి వుంటుంది 


 𒊹︎︎︎కార్డు పంపిణీ చేయు విధానం :

 

Card Delivery'  అనే ఆప్షన్నీ  సెలెక్ట్ చేసుకుని లబ్ధిదారుని ఆధార్ ద్వారా కుటుంబ సభ్యుల లిస్టు వస్తాయి వచ్చిన కుటుంబ సభ్యుల వివరాలలో AUTHENTICATED అని ఉన్న లబ్ధిదారుల కార్డులకు  మాత్రమే పంపిణీ చేయటానికి వీలవుతుంది. కార్డులు నేరుగా లబ్ధిదారుని కి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇవ్వవచ్చు అందుకుగాను SELF, FAMILY అని రెండు OPTION లు  ఉండటం జరుగుతుంది  అవి సెలెక్ట్ చేసుకోవాలి. వాటిలో లబ్ధిదారుడైతే SELF అని లేదా కుటుంబ సభ్యులైతే FAMILY అని  ఎంచుకోవాల్సింది ఉంటుంది  సబ్మిట్ క్లిక్ చేసి కార్డు తీసుకోదలిచిన వారి ఆధార్ నెంబర్ ను  ఎంటర్ చేసి OTP ద్వారా కార్డు డెలివరీ చెయ్యటం జరుగుతుంది