YSR Bima 2023-24 Survey Process

 

వైయస్ఆర్ భీమా పథకం అనేది ఏపీ ప్రభుత్వ భీమా పథకం  కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించిన లేదా వికలాంగుడిగా మారిన ఆ కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైస్సార్ భీమా పథకాన్ని కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే 

✤ 2022-23 సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ భీమా పథకము మొత్తం 1 కోటి 22 లక్షల లబ్ధిదారులకు  అందించడం జరిగినది. 

 సాధారణ మరణము పొందిన వారికి 30.06.2023 తేదిన  ప్రమాదము ద్వారా మరణించిన వారికి 15-07-2023 నాటికీ ఈ పథకం పూర్తి అయినది. 

 2023-24 సంవత్సరానికి సంబంధించి YSR బీమా పథకానికి సంబంధించి అప్డేట్ రావటం జరిగింది  తేదీ జులై 1, 2022 నుండి ఈ పథకాన్ని మరల ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

 సాధారణ మరణము ద్వారా మరణించిన వారికి జులై 1 2023 నుండి ప్రమాదవశాత్తు మరణించిన వారికి జులై 16 2023 నుండి  ఈ  వైయస్ఆర్ భీమా పథకం మరల ప్రారంభం అవుతుంది


Note::
మీ మొబైల్ లోని పాత వెర్షన్ un install చేసి న్యూ వెర్షన్ install చేసుకోండి

వాలంటీర్ క్లస్టర్ వైస్ సర్వే రిపోర్ట్ 👇
Ysr bima enrollment 2023-24 Dashboard

వైస్సార్ బీమా నిరాకర్ణ పత్రం డౌన్లోడ్ 👇
YSR bima not interested form

బీమా సర్వే చేసేటప్పుడు ఉపయోగపడే పాలసీదారులు మరియు నామినీ యొక్క occupations (వృత్తులు) కి సంబందించిన వివరాలు క్రింది లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోగలరు👇
ysr bima jobs list 2023 pdf

వైయస్ఆర్ భీమా పథకం లో ఎంత అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది 

 18 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండి సాధారణ మరణము జరిగినట్టయితే  వారి నామినీ కి  లక్ష రూపాయలు నగదును  ప్రభుత్వం నుండి అందించడం జరుగుతుంది

 18 నుండి 70 సంవత్సరాల మధ్య  వయ్యస్సు ఉండి ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత వికలాంగులుగా మారిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా పేమెంటు అందించడం జరుగుతుంది

ముందుగా జరిగిన సర్వేలో  భాగంగా ప్రాథమికంగా సంపాదించే వ్యక్తిని తప్పుగా నమోదు చేసిన ఉంటే  మార్చుకోవడానికి  15.07.23 నాటికీ వయసు రిత్యా వైయస్సార్ బీమా పథకానికి సంబంధించి ప్రమాదవశాత్తు మరణించిన వారి ఇన్సూరెన్స్ కు అనర్హులైన వారిని మార్చుకునేందుకు   BPL కుటుంబాలలో ప్రాథమిక సంపాదించే వారిని జోడించడం లేదా అప్డేట్ చేయడం,eKYC చెయ్యటం కోసం మరలా డోర్ టు డోర్ సర్వే చెయ్యవలసి  ఉంటుంది.


అర్హత 
✤ 18 సంవత్సరాలు వయ్యస్సు  నిండిన వారై ఉండాలి.
✤ 70 సంవత్సరాల లోపు వయ్యస్సు  అయి ఉండాలి 
✤ BPL కుటుంబానికి చెంది ఉండాలి అనగా తప్పనిసరిగా రేషన్ కార్డు / రైస్ కార్డు కలిగి ఉండాలి.
కుటుంబంలో ప్రాథమికంగా సంపాదించే వ్యక్తి అయి ఉండాలి.

నామిని 

✤ వివాహం జరిగినట్టయితే తన భర్త లేదా భార్యను నామినిగా ఎంచుకోవాల్సి ఉంటుంది 
✤ వివాహము జరిగి భర్త లేదా భార్య అందుబాటులో లేకపోయినట్టు అయితే  అప్పుడు  కొడుకో లేదా ✤ కూతురుని నామినేగా ఎంచుకోవాల్సి ఉంటుంది
✤ వివాహము జరగనట్టయితే అప్పుడు తండ్రి లేదా తల్లిని నామినేగా ఎంచుకోవలసి ఉంటుంది
✤ ఒకవేళ తల్లి లేదా తండ్రి ఇద్దరు లేకపోయినట్లయితే అప్పుడు పెళ్లి కానీ లేదా విడాకులు తీసుకున్న చెల్లి లేదా అక్కను నామినీ గా ఎంచుకోవాల్సి ఉంటుంది



వాలంటీర్  ఏవిధంగా సర్వే  చెయ్యాలి 


✤ లాస్ట్ ఇయర్  సర్వే చేసిన వారికి  డేటా సరిగా ఉన్నట్టు అయితే 
✤ వైయస్సార్ బీమా వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లు లో  రైస్ కార్డు కి ప్రాథమిక సంపాదనదారుడు వివరాలు చూపించడం జరుగుతుంది. 
✤ సర్వే లో  ఆ వివరాలను అనగా అతను ప్రాథమిక సంపాదన దారుడా కాదా , నామిని వివరాలు, వారికి రైస్ కార్డు ఉందా  లేదా, మిగిలిన వివరాలు సరిపోయాయా లేవా అని చూసుకోవాలి. 
✤ అన్ని వివరాలు సరిగా ఉన్నట్టయితే అప్పుడు వారికి  మొబైల్ అప్లికేషన్లో e-KYC పూర్తి చేయాలి


ప్రాథమిక సంపాదన దారుని మార్చటం

కుటుంబ సభ్యుల విన్నపం మేరకు వాలంటీర్ వారు ఫ్యామిలీ మెంబర్లు ఒకరిని ప్రాథమిక సంపాదన దారుణంగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది వారి ఆధార నెంబర్   ఎంటర్ చేయాలి బయోమెట్రిక్ ద్వారా eKYC పూర్తి చేసి UIDAI తో వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది. పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయసు, వృత్తి, కులము, ఉప కులము వెరిఫై చేయాలి నామిని వివరాలను ఎంటర్ చేయాలి అనగా పేరు, ఆధార నెంబరు, డేట్ అఫ్ బర్త్ ,రిలేషన్ మరియు బ్యాంకు వివరాలు నమోదు చేయాలి.

నామిని ని మార్చటం

ముందుగా ఉన్నటువంటి నామిని వివరాలను మార్చి కొత్తగా నామిని వివరాలను అప్డేట్ చేయవలసి ఉంటుంది.
నామిని తప్పనిసరిగా సంపాదించే వ్యక్తి యొక్క కుటుంబంలోని వ్యక్తి అయి ఉండాలి  ఒకవేళ నామిని మైనర్ అయినట్లయితే గ్రామ వార్డు వాలంటీర్ వారు ఎవరికైతే సర్వే చేస్తున్నారో వారి ఇష్టపూర్వకంగా వారి సంరక్షకుల పేరు  ఆధార నెంబరు మరియు రిలేషన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.అన్ని వివరాలను సరిగా చదివిన తరువాత అక్కడ చూపిస్తున్న Disclaimer ను చూసుకొని గ్రామ వార్డు వాలంటీర్ల బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది.తరువాత  సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

కొత్తవారికి 


గ్రామ వార్డు వాలంటీర్ వారు డోర్ to డోర్  వెళ్లి వారి యొక్క రైస్ కార్డు నెంబర్ను వైయస్సార్ బీమా వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది  కుటుంబం అంగీకార ప్రకారం కుటుంబంలో ఒకరిని ప్రాథమికంగా సంపాదించే వ్యక్తిగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ప్రాథమిక సంపాదన దారుణ యొక్క తండ్రి లేదా భర్త లేదా భార్య పేరు, వయస్సు  , కులము, మరియు ఉపకులము, వృత్తి ఎంటర్ చేయాలి. నామినీ వివరాలు అనగా పేరు, ఆధార నెంబరు, పుట్టిన తేదీ, సంబంధము, బ్యాంకు యొక్క వివరాలను ఎంటర్ చేయాలి. నామిని మైనర్ అయినట్టు అయితే వాలంటీర్ వారు సర్వే చేస్తున్న వారి ఇష్టపూర్వకంగా వారి యొక్క సంరక్షకుల పేరు, ఆధార్ నెంబర్ , సంబంధము ఎంచుకోవలసి ఉంటుంది.
చివరగా వాలంటీర్ వారు కన్సెంట్ తీసుకొని వారి యొక్క బయోమెట్రిక్ వెయ్యవలసి ఉంటుంది. డేటాను సబ్మిట్ చేయాలి.

WEA/WWDS  వారి  సర్వే 


ముందు సర్వే చేసిన వారికి WEA / WWDS వారు ముందుగా ఉన్నటువంటి ప్రాథమిక సంపాదనదారుల వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది  అని చెప్పవచ్చు  అదేవిధంగా వాలంటీర్ వారు వెరిఫై చేసిన వివరాలను కూడా ఒకసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది  అదేవిధంగా ప్రాథమిక సంపాదన దారుని వివరాలలో మార్పులు మరియు నామిని మార్పులు మరియు ఇతర మార్పులు ఏవైతే వాలంటీర్ వారు చేస్తారో అవి చూసి  జాగ్రతగా వెరిఫై చేయవలసి ఉంటుంది


కొత్తవారికి
✤ గ్రామ వార్డు వాలంటీర్ వారు ముందుగా సబ్మిట్ చేసిన PBE ల వివరాలను WEA / WWDS వారు వెరిఫికేషన్ చెయ్యవలసి  ఉంటుంది.
✤ PBE అయినట్టు అయితే అప్పుడు WEA / WWDS వారు eKYC చేయాలి. కాక పోతే కుటుంబ సభ్యుల విన్నపం మేరకు ఒకరిని PBE గా సెలెక్ట్ చేసుకోవాలి
✤ ఆధార నెంబర్  ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత పేరు  తండ్రి పేరు / భర్త లేదా భార్య పేరు, వయసు, కులము, వృత్తి, వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది.
✤ నామిని యొక్క పేరు, ఆధార్ నెంబరు, డేట్ అఫ్ బర్త్, సంబంధమును , వెరిఫై చెయ్యవలసి ఉంటుంది 
✤ నామిని మైనర్ అయినట్లయితే సంరక్షకుల యొక్క వివరాలు అనగా పేరు, ఆధార్ నెంబర్ , సంబంధము వెరిఫైచెయ్యాల్సి ఉంటుంది 
✤ WEA / WWDS వారికి సర్వేలోని అన్ని వివరాలు మార్పులు లేదా అప్డేట్ చేసే  అవకాశం ఆప్షన్ ఉంటుంది.
✤ WEA / WWDS వారు చివరగా అన్ని వివరాలను సరి చూసి   చదివిన తరువాత వారి కాన్సెంట్ ఇవ్వాలి. డేటా సబ్మిట్ చేయూలి.
✤ చివరిగా సర్వేకు సంబంధించి PBE వారి నమోదు మరియు నామినీల వివరాల మార్పు చేర్పు లు తేదీ 07-06-2023 లోపు పూర్తి చెయ్యవలసి ఉంటుంది.