రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమం భారం కాకుండా మరియు పెళ్ళి కుమార్తె పెళ్ళి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ర్టప్రభుత్వం వారు పెళ్ళికానుక
పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక , బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం వైఎస్సార్ పెళ్ళి కానుక" రూపకల్పన ముఖ్య ఉద్దేశ్యం
మీ దగ్గర లోని మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయాల్లో పెళ్ళి కానుక దరఖాస్తును నమోదు చేస్తున్నారు. నమోదు చేసిన వెంటనే
అప్లికేషన్ ఐడీనంబర్ అభ్యర్థుల మొబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. అనంతరం కళ్యాణమిత్రలు వచ్చి వివరాలు సేకరించి దర్యాప్తు
చేస్తారు. ఆ తర్వాత ముందుగా రావాల్సిన 20 శాతం నగదును పెళ్ళి కూతురు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. వివాహం అయ్యాక
మిగతా మొత్తాన్ని జమ చేస్తారు. అనంతరం వివాహ ధృవీకరణ పత్రం ఇస్తారు.
కావాల్సిన పత్రాలు
మీ సేవా జారీ చేసిన నేటివిటి , కమ్యూనిటీ, జనన ధృవీకరణ పత్రం.
కుల ధృవీకరణ పత్రం, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.
వయస్సు నిర్ధారణకు 10 తరగతి లేదా ఇంటిగ్రేటెడ్ మీ సేవా సర్టిఫికేట్.
తెల్ల రేషన్ కార్డ్ లేదా మీ సేవా ఆదాయ ధ్రువీకరణ పత్రం.
పెళ్ళికూతురు బ్యాంకు ఖాతా జరాక్స్ ను ఇవ్వాలి.
దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ ( కనీసం 40 శాతంగా ఉండి శాశ్వత అంగవైకల్యం కలిగి ఉండాలి).
భవణ నిర్మాణ కార్మికులైతే కార్మికశాఖ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా గుర్తింపు కార్డ్
ప్రయోజనాలు
- వైఎస్సార్ పెళ్ళి కానుక ( ఎస్ సి - కులాంతర ) - 75,000
- . వైఎస్సార్ పెళ్ళి కానుక ( గిరి పుత్రిక ) - 50,000
- వైఎస్సార్ పెళ్ళి కానుక ( బి సి ) - 35,000
- వైఎస్సార్ పెళ్ళి కానుక ( దుల్హన్ ) - 50,000
- వైఎస్సార్ పెళ్ళి కానుక ( దివ్యాంగులు ) - 1,00,000
- వైఎస్సార్ పెళ్ళి కానుక ( APBOCWWB ) - 20,000
- వైఎస్సార్ పెళ్ళి కానుక ( ఎస్ టి - కులాంతర) - 75,000
- వైఎస్సార్ పెళ్ళి కానుక ( బి సి - కులాంతర ) - 50,000
- వైఎస్సార్ పెళ్ళి కానుక ( ఎస్ సి ) - 40,000
వివాహానికి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి వధువు, వరుడు ఇద్దరూ ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి. ఇరువురు ఏపీ రాష్ట్ర నివాసితులై ఉండాలి. వివాహం ఏపీ లోనే చేసుకోవాలి. ఇద్దరికీ ఆధార్ కార్డ్, వధువు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. వధువు బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసి ఉండాలి. వివాహం తేదీ నాటికి వధువుకు 18 , వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. తొలిసారి వివాహం చేసుకునే వారు మాత్రమే పథకానికి అర్హులు. వరుడు ఇతర రాష్ట్రానికి చెందిన వాడైనా, వధువు ఏపీకు చెందినట్లయితే పథకానికి అర్హులే. వివాహం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరుగవలెను.
నమోదు చేసుకునే విధానం
మన దగ్గర రూరల్ ఏరియా వెలుగు మండల కార్యాలయం :
నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక, వివాహ సమయం నిర్ణయించబడి ఉండాలి. వివాహ తేదీకి కనీసం 5
రోజుల ముందు నమోదు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు రూరల్ వెలుగు మండల మహిళా సమాఖ్యలో నమోదు చేసుకోవచ్చు.
మన దగ్గర అర్బన్ ఏరియా - మెప్మా - మున్సిపాలిటీ కార్యాలయం :
నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక, వివాహ సమయం నిర్ణయించబడి ఉండాలి. వివాహ తేదీకి కనీసం 5
రోజుల ముందు నమోదు చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు అర్బన్ మెప్మా లో నమోదు చేసుకోవచ్చు.