YSR AAROGYASRI

  ఈ ఆరోగ్యశ్రీ సంక్షేమ  పథకం అనేది  ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథకంగా మంచి  గుర్తింపు పొందింది. ఈ పథకం కింద అర్హులైన  ప్రతి నిరు  పేద రోగులకు ఉచితంగా మంచి  సేవలు అందిస్తారు వైద్య సేవలు అందించడంతో పాటు రవాణా మరియు భోజన వసతి వంటి  సదుపాయాలను కల్పిస్తారు ఈ పథకం ద్వారా సుమారు  2014 సెప్టెంబరు నాటికి  మొత్తం 26 లక్షల మంది  మధ్య  నిరుపేద రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ సీఎం అయిన తరువాత ఆరోగ్యశ్రీని "వైయస్సార్ ఆరోగ్యశ్రీగా మార్చి అమలు చేస్తూ ఈ పథకంను మరింత  మందికి విస్తృతం చేసి  రాష్ట్ర జనాభాలో 90 శాతం పైగా ప్రజలు ఆరోగ్యశ్రీ పరిధిలో  ఉండి ఉచిత కార్పొరేట్ వైద్యసేవలు కూడా  అందుకోవడానికి వీలు కల్పించారు

ఈ పథకం కింద  సుమారు 1038 (పైగా) జబ్బులకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2.5 లక్షల రూపాయలు  వరకు వర్తింపజేస్తున్నారురోనా బారినపడిన వారందరికీ  వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద అన్ని ప్రముఖ  హాస్పిటల్స్ లో ఉచిత చికిత్స  అందించేందుకు ఆదేశాలు ఇచ్చిన వైయస్ జగన్ గారు  ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2.5 లక్షల వరకు మొత్తం వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన వున్నా వారికి  పేదవారికి ఆరోగ్యశ్రీ కార్డులను జారీచేస్తుంది. 

 

 

అర్హత

వైయస్సార్ పింఛన్, జగనన్న విద్యా, వసతి దీవెనకార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు

3000 చదరపు అడుగుల స్థలం లోపు వైశాల్యానికి మునిసిపల్ ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు.

అన్ని రకాల బియ్యం కార్డులు ఉన్నవారు ఆరోగ్యశ్రీ  సంక్షేమ పథకానికి అర్హులు.

12 ఎకరాల కన్నా తక్కువ తడి(తరిభూమి.. 35 ఎకరాల కన్నా తక్కువ తడి భూమి ఉన్న యజమానులు ఈ  పథకానికి అర్హులు (లేదా) మెట్ట మరియు మాగాణి కలిపి 35 ఎకరాల లోపు కలిగినవారు   పథకానికి అర్హులు.

రూ.ఐదు  లక్షల వరకు  గల వార్షిక ఆదాయం  పొందుతూ వున్నా వారికి  వైయస్సార్ ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకం వర్తింప  బడుతుంది 

5 లక్షల లోపు ఆదాయపన్ను చెల్లింపులను చేస్తున్న కుటుంబాలు సైతం  వారు ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు

రూ.5 లక్షల లోపు వార్షికఆదాయం ఉన్న అవుట్సోర్సింగ్,మరియు కాంట్రాక్ట్, మరియు పార్ట్ టైం ఉద్యోగులు మరియు  పారిశుద్ధ్య కార్మికులు కూడా  అర్హులు

కుటుంబంలో ఒక నాలుగు చక్రాల వాహనం ఉన్నా వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు

కుటుంబ సభ్యులందరి ఈకేవైసీ పూర్తి అయి ఉండాలి. అలాగే వాలంటీర్ నందు మీ గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ నందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో  వారు ఒక కుటుంబంగా నమోదు అయి ఉండాలి. ఆరోగ్యశ్రీ కార్డుకు  పథకానికి అప్లై చేయదలచిన కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డ్ జరాక్సులు మరియు  న్యూ రైస్ కార్డ్ జరాక్స్, కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో, అప్లికేషన్ ఫాామ్ ను జతపరచి సంబంధిత  మీ  దగ్గరలోని గ్రామ సచివాలయం లోని డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో ధరఖాస్తు చేసుకొనవచ్చును మరియు  లేదా గ్రామ/వార్డు మీ వాలంటీర్  ద్వారా  గాని దరఖాస్తు చేసుకొనవచ్చును. దరఖాస్తు చేసిన "20 రోజులలో" అర్హులైన దరఖాస్తుదారునికి డా. వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీీ కార్డు వాలంటీర్ల ద్వారా ఇవ్వబడుతుంది

అప్లికేషన్ ఫామ్

 కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు జరాక్స్ లు

 రైస్ కార్డు జరాక్స్

 కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో

 

కొత్తగా పెళ్లి అయి కోడలు అత్తగారి కార్డులో చేర్చుట కొరకు 

   అమ్మాయి వారి తల్లిదండ్రుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నవశకం  లాగిన్ లో  మైగ్రేషన్ డ్యూ టూ మ్యారేజ్ అని ముందుగా ధృవీకరించాలి

   కొత్తగా పెళ్లి అయిన కోడళ్ళను అత్తగారి ఇంటిలో వున్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు యాడ్ చేయవలెను 

  అలా చేసిన తరువాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యశ్రీ కార్డులో అమ్మాయి పెళ్లికి ముందు ఉంటే అక్కడ మైగ్రేషన్ డ్యూ టూ మ్యారేజ్ అని డిజిటల్ అసిస్టెంట్ నవశకం లాగిన్ లో సబ్మిట్ చేయాలి

  ముందుగా లేకపోతే చేయనవసరం లేదు

మొదటగా కొత్తగా పెళ్లి అయిన కోడళను అత్తగారి ఇంటిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీ  చేయవలెను. అలా చేసిన తరువాత అమ్మాయి వల్ల కార్డు లో అమ్మాయి పెళ్ళికి ముందు ఉంటే అక్కడ Migration Due Marriage అని ఆప్షన్ సెలెక్ట్ చేయాలి  డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో సబ్మిట్ చెయ్యాలి. ముందు గ లేక పోతే చెయ్యనవసరం లేదు. అప్పుడు అత్తగారి పరిధిలో  వుండే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నవశకం నందు అడిషన్ యాడ్  పెట్టుకోవాలి.

  అప్పుడు అత్తగారి పరిధిలో  వుండే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నవశకం నందు అప్లికేషన్ పెట్టుకోవాలి

 

 పుట్టిన పిల్లలను చేర్చుట  డిజిటల్ అసిస్టెంట్ వారి నవశకం లాగిన్ లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కల్గిన  ఉన్నవారిని డైరెక్ట్ గా యాడ్ చేయవచ్చు

ఏ కార్డు లో లేకుండా 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న గల  వారిని చేర్చుట కొరకు  మొదటగా వారి కుటుంబంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా చేర్చి తద్వారా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో యాడ్  చేర్చుకోవచ్చును

వ్యక్తిని తొలగించాలి అంటే మొదటగా అతను లేదా  ఆమెను ను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు   " పర్మినెంట్ మైగ్రేషన్ లేదా   డెత్ డిక్లరేషన్/ టెంపరరీ మైగ్రేషన్/ మైగ్రేషన్ డ్యూ టూ మ్యారేజ్ " లో వారికి అనుగుణంగా ఏదో  ఒకటి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయవలెను

 

 తరువాత వేరే చోట చేర్చిన తరువాత నవశకం లాగిన్ నందు అతను/ఆమెకు " పర్మినెంట్ మైగ్రేషన్ లేదా డెత్ డిక్లరేషన్ లేదా టెంపరరీ మైగ్రేషన్/ మైగ్రేషన్ డ్యూ టూ మ్యారేజ్ " అని చూపిస్తాయి. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మీకు  కొద్దిరోజుల్లో అతను/ఆమె ఆ కార్డు నుంచి డిలీట్ అవుతారు

 

వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.

 ఆరోగ్యశ్రీ  సంక్షేమ పథకం ద్వారా ఒక్కో మొత్తం  కుటుంబానికి ఏడాదికి 2.5 లక్షల వరకు పథకం వర్తింపజేస్తున్నారు

కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం

 ఆరోగ్యశ్రీ లోకి " బ్లాక్ ఫంగస్ " కూడా  యాడ్  చేసినారు 

 ఆరోగ్యశ్రీ పథకం సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదై ఉచిత వైద్య సేవలను పొందే వెసులుబాటు కల్పించడం జరిగింది

 

20 రోజుల ధ్రువీకరణ ప్రక్రియ కింది విధంగా ఉండును :

 

1 వ రోజు ఆర్.టి.జి.యస్ సేవల ద్వారా సిస్టం వాలిడేషన్ పొందిన దరఖాస్తును స్వీకరించబడును.

 

2 వ రోజు నుంచి 6 వ రోజు వరకు ఆరోగ్యశ్రీ కి  సంబంధిత శాఖ మరియు జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్తచే

 పరిశీలన

7 వ రోజు యు.హెచ్..డి ను జెనరేట్ చేయుట మరియు హెల్త్ కార్డు ఆమోదించుట

 

8 వ రోజు పిడిఎఫ్ ను జెనరేట్ చేసి ప్రింటింగ్ ఇవ్వడం  జరుగుతుంది 

 

9 వ రోజు నుంచి 19 వ రోజు వరకు  కార్డులను ముద్రించి సంబంధిత సచివాలయాలకు కొరియర్ ద్వారా  రవాణా చేయుట

 

20 వ రోజు సంబంధిత వాలంటీర్ ఆరోగ్యశ్రీ కార్డును దరఖాస్తుదారునికి, వారి ఇంటివద్ద పంపిణీ చేసి, లబ్ధిదారునికి కార్డు అందినట్లుగా, బయోమెట్రిక్ ద్వారా అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది

 

 

జబ్బుల బారిన పడిన పేద జనానికి మెరుగైన వైద్యం అందక ఆస్తులు అమ్ముకుని ప్రాణం కాపాడుకోవడానికి బడుగుజీవి పడే అవస్థలను చూసి సరికొత్త పథకానికి నాంది పలికింది. డబ్బులు ఉన్నవాడికే కార్పొరేట్ వైద్యం మరియు  లేనివాడు ఆరోగ్యం కోసం అప్పుల పాలైనా కావాలి లేదా  ప్రాణం మీద ఆశ వదులుకోవాలి. ఈ పరిస్థితిలో సమూల మార్పు తీసుకువచ్చి, సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం  అందుబాటులో ఉచితంగా అందించే ధన్వంతరి మంత్రంగా ఆరోగ్యశ్రీ పథకం అమలులోకి వచ్చింది.. .