E- Crops Booking details
ఈ క్రాప్ బుకింగ్ నమోదు
రైతులు పండించే పంటలను ముక్యంగా ఆన్లైన్లో నమోదుచేసుకోవడమే ఈ క్రాప్ బుకింగ్ అంటారు. పంటను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా వలన రైతులకు ఎన్నో ప్రయోజనాలు కల్గి ఉంటాయి. అలాగే తాము పండించి తన పంటను ప్రభుత్వానికి కి మద్దతు దర కి అమ్ముకోవచ్చు. అలాగే తమ పంటకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా, అకాల వర్షాల వలన పంట డ్యామేజ్ అయినా రైతుల పంట కి క్రాప్ బుకింగ్ చేయటం వలన జరగడం వలన గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం వస్తుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రాప్ బుకింగ్ కి సంబంధించి రైతులకు సరి కొత్త విధానంలో క్రాప్ బుకింగ్ అనేది చేయడం జరుగుతువుంది రైతు ఇంతకు ముందు క్రాప్ బుకింగ్ అనగాసాగు తన పంటను ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు ల్యాండ్ హోల్డర్ సాగు చేసేవారు అనగా భూమి యజమాని లేకున్నా ఈ క్రాప్ బుకింగ్ అనేది జరిగేది కానీ ఈ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూయజమాని బయోమెట్రిక్ అతంటికేషన్ ద్వారా ఈ క్రాప్ బుకింగ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు కచ్చితంగా తమ బయోమెట్రిక్ అతంటికేషన్ ద్వారా పంటను online lo నమోదు చేసుకోవాలి
పంటను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం కొరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి పంచాయతీ కి ఒక ఆర్బికే అనగా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది రైతులు నేరుగా తమ దగ్గర ఊరిలోనే ఉండే రైతు భరోసా కేంద్రం కి వెళ్లి తమ పంటను స్వయంగా నేరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చును . రైతు భరోసా కేంద్రం లో ఈ క్రాప్ బుకింగ్ చేయడం కోసం ప్రభత్వం ఒక అగ్రికల్చర్ అధికారి రైతుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అగ్రికల్చర్ అధికారి తమ పరిధిలోని ప్రతి ఒక రైతుని ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా అందరి రైతులకు ఖచ్చితంగా తెలియజేయాలి.
రైతులు తమ పండించే పంటను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం కొరకు నేరుగా వెళ్ళి రైతు భరోసా కేంద్రం కి వెళ్లి తమ పంటలకు సంబంధించి సమాచారం రైతులు ఏ పంటను తమ పొలంలో వేశారో అగ్రికల్చర్ అధికారి గారికి తెల్పవలెను
రైతులకి తమ పండించినా పంట క్రాప్ బుకింగ్ నందు నమోదు అయినదని రైతు భరోసా కు సంబంధించి అగ్రికల్చర్ అధికారి ఒక recipet రైతుకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రిసిప్ట్ లో వున్నా రైతుకు సంబంధించి బుకింగ్ కోడ్ అనేది జరిగి ఉంటుంది. ఈ బుకింగ్ కోడ్ ద్వారా రైతులు తమ పంట ఆన్లైన్లో లో నమోదు అయిందని తెలుసుకోగలరు.
రైతులు తమ పండించినా పంటను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం కొరకు నేరుగా స్వయంగా రైతు భరోసా కేంద్రం కి వెళ్లి తమ పంటలకు సంబంధించి సమాచారం రైతులు ఏ పంటను తమ పొలంలో వేశారో అగ్రికల్చర్ అధికారికి గారికి తెల్పవలెను
ఈ క్రాప్ బుకింగ్ కొరకు ఈ క్రింది డాక్యుమెంట్స్ కావాలి
ఆధార్ కార్డు
· రైతు ఆధార్ కార్డు
· రైతు యొక్క పని చేసే ఫోన్ నెంబర్
· వన్ బి అడంగల్ పాసుబుక్
· బ్యాంకు పాస్ బుక్ పేజీ
· భరోసా అప్లికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఇక నుంచి రైతులకు ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ అనేది తమ పండించే పంటకు జరగాలి. క్రాప్ బుకింగ్ జరిగినా ప్రతి ఒక రైతుకి గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని భీమాలు అందుతాయి. అలాగే ఈ సంవత్సరం నుంచి తప్పనిసరిగా పంట నమోదు క్రాప్ ఆన్లైన్లో రైతులు చేపించుకోవాలి అలా పంట ఆన్లైన్లో నమొదు చేయించుకుంటేనే రైతు భరోసా అనేది పడుతుంది. చాలా మంది నిరు పేద రైతులు తమకు తెలియక చాల మంది క్రాప్ బుకింగ్ చేయించుకోరు. అలా చేయించుకొని ఎడల రైతులకు ఎట్టి పరిస్థుతలో రైతు భరోసా రాదు. కాబట్టి ప్రతి ఒక రైతు తమ పంటను కచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయించుకోండి.
ఫస్ట్ చూస్తే వైఎస్సార్ రైతు భరోసా పథకం ఈ పథకం ద్వారా ఎంతోమంది పేద రైతులకు పదమూడువేల ఐదు వందలు పెట్టుబడి సాయం ప్రతి ఒక సంవత్సరం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది దీని ద్వారా రైతులకు బాగా ఎంతో మేలు జరుగుతుంది.
రెండో పథకం వైస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు వంటి ఈ పథకంతో గత ప్రభుత్వంలో అలాగే ఇప్పుడు రైతులు తమ కు అవసరానికి కావాల్సిన పెట్టుబడి సాయం నేరుగా బ్యాంకు నుండి సున్నా వడ్డీ రూపంతో తో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం లో ఉండే రైతులు బ్యాంకు వారికి వడ్డీ చెల్లిస్తే ఆ చెల్లించిన వడ్డీ మొత్తం తిరిగి మళ్ళి మన ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేయడం జరుగుతుంది.
మూడో పథకం వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం ఈ పథకం ద్వారా రైతులు తమ పంట ఎక్కడైతే నష్టపోయివుంటారో నష్టపోయిన పరిహారానికి తిరిగి మరల ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. ఇలా జరిగే దానినే వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా అని అంటారు. ఈరోజు రైతులందరికీ ఈ పథకం ద్వారా నష్టపరిహారం నేరుగా వారి బ్యాంకు అకౌంట్ లో వేయడం జరుగుతుంది
నాల్గొవ పథకం ఉదేశ్యం దాన్యం కొనుగోలు ఇందులో వచ్చేసి రైతులు పండించిన తమ పంటను తిరిగి క్రాప్ బుకింగ్ చేయించుకోవడం వలన మరల ప్రభుత్వానికి రైతులు పండించిన ధాన్యాన్ని తిరిగి కొనుక్కోవడం జరుగుతుంది
ఐదవ పథకం ఈ పథకం రైతుకు ఎంతో మేలు జరుగుతుంది ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఈ పథకం ద్వారా రైతులందరికీ ఫ్రీ ఉచితంగా కరెంట్ వ్యవసాయానికి సంబంధించిన కరెంట్ ను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. ఈ సబ్సిడీ అమౌంట్ ఏ దైత్ మొత్తం ప్రభుత్వం భరిస్తుంది. అలాగే పగటిపూట తొమ్మిది గంటల కరెంటు ని రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిచడం జరుగుతుంది
ఆరోవా పథకం ఎవ్వరైతే శెనగలు పండించారో శనగ రైతులకు బోనస్ ఈ పథకం ద్వారా శనగ పంట కు సంబంధించి పేద రైతులకు నష్టపరిహారం జరిగి ఉండటం జరిగింటుందో వారందరికీ ప్రభుత్వం బోనస్ రూపంలో మూడు వందల కోట్లు రిలీజ్ చేయడంఅయ్యింది
రైతు తమ పంటను ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవడం వలన చాలా ముఖ్యంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అందులో కొన్ని చాల ముఖ్యమైన క్రింద వివరించడం జరుగుతుంది
ఉచిత పంట భీమా పథకం
పంట నష్ట సహాయం
సున్నావడ్డీ రుణాలు
ప్రభుత్వ మద్దతు ధర
రైతు భరోసా
ఈ క్రాప్ బుకింగ్ పండించే పంట ను నమోదు చేసేటప్పుడు అగ్రికల్చర్ అధికారి రైతు పండించే పంట కి ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు అధికారి ఈ ఉచిత పంటల బీమా కు సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా రైతు పండించే పంట కి ఆన్లైన్లో నమోదు చేస్తారు. రైతు ఈ క్రాప్ బుకింగ్ చేసేటప్పుడు తమ పండించే పంట కి పంటల బీమా చేశారో లేదో కనుకొని అగ్రికల్చర్ అధికారి ఆఫీసర్ ని అడగాలి. అలా చేస్తేనే రైతు పంట కి ఏదైనా మరి సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందుతుంది
రైతులు తమ పండించే పంటను ఈ క్రాప్ బుకింగ్ చేయించడం ద్వారా వలన రైతు పంట కి అకాల వర్షాల ద్వారా కానీ మరియు ఏ ఇతర సమస్య కారణం చేత కానీ పండించే పంటకు నష్టం జరిగితే రైతు కనుక ఈ క్రాప్ బుకింగ్ అనేది తమ పంటకు చేయించుకొని ఉంటేనే ఈ పంట నష్టం సహాయం అనేది ప్రభుత్వం నుంచి అందుతుంది. లేదంటే పంట నష్టం సహాయం అనేది ప్రభుత్వం నుంచి అందడం జరగదు కాబట్టి ప్రతి ఒక్క రైతు తప్పకుండ ఈ క్రాప్ బుకింగ్ అనేది కచ్చితంగా ఆన్లైన్ చేయించుకోండి.
రైతులు తమ పండించే పంట క్రాప్ బుకింగ్ జరగడం వలన తమ పంటకు బ్యాంకు ద్వారా సున్నా వడ్డీ రుణం అంటే రైతు పెట్టిన పంటకు వడ్డీ లేకుండా బ్యాంక్ నుంచి సత్వర రైతులు డబ్బు తెచ్చుకోవచ్చు.
ఈఏడాది నుంచి రైతులకు రైతు భరోసా సొమ్ము అకౌంట్లో పడాలి అంటే తప్పనిసరిగా తమ పండించే పంట అని ఈ క్రాప్ బుకింగ్ చేయించుకుంటేనే లేదు అంటే రైతులకు రైతు భరోసా సొమ్ము ఎట్టి పరిస్థితిలో రాదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు తమ పంట ని కచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయించుకోండి...
రైతులు పండించి న తన పంటను నేరుగా ప్రభుత్వమే స్వయంగా ప్రభుత్వం ప్రకటించి న మద్దతు ధరకే రైతు నుంచి పంటను కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ పంటను రైతు దళారులకు అమ్ముకోకుండా మోసపోకుండా ప్రభుత్వం అమ్మాలంటే ఈ క్రాప్ బుకింగ్ అనేది తప్పనిసరి ఒకవేళ రైతు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోకుండా ఉంటే ప్రభుత్వం కి తన పండించే పంట ని రైతు అమ్ముకో లేడు. కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా క్రాప్ బుకింగ్ తమ పండించే పంట కు చేయించుకోవాలి...
ఈ క్రాప్ బుకింగ్ గురించి ప్రతి వాలంటీర్స్ తమ పరిధిలోని ప్రతి ఒక రైతు కి అవగాహన కల్పించాలి. రైతు భరోసా కేంద్రం లో వాలంటీర్స్ అందరికీ అగ్రికల్చర్ అధికారి ఈ క్రాప్ బుకింగ్ గురించి వాలంటీర్స్ కి అందరికి పూర్తి సమాచారం తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి వాలంటీర్స్ ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క రైతు చేత తమ పండించే పంటను ఈ క్రాప్ బుకింగ్ కచ్చితంగా చేయించుకోవలసి ఉందిగా తెలియజేయవలెను.