Ysr Bima Details Eligibility Criteria👈

 




YSR బీమా 

రైస్ కార్డ్ కుటుంబాలలో Primary Bread Farmer (కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) దురదృష్టవశాత్తు

అనారోగ్యము లేదా ప్రమాదవశాత్తు అకాల మరణానికి గురి అయినప్పుడు ఆ కుటుంబము తీవ్ర

మనోవేదనకు గురి అవటమే కాకుండా కుటుంబాన్ని పోషించే వ్యక్తి కష్టంపై ఆధారబడి జీవిస్తున్న

కుటుంబ సభ్యులు ఆర్ధికముగా తీవ్ర ఇబ్బందులకు గురి అవటము జరుగు చున్నది.

అకాల మరణము లేదా  మరియు అంగ వైకల్యము జరిగిన మరియు అనారోగ్యముతో కుటుంబాన్ని మొత్తం  పోషించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాలకు ఆర్ధికముగా  తోడ్పాటు సహాయము అందించి కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతను అందించి  వారికీ మనో ధైర్యము కల్పించాలనేది YSR బీమా పథకం యొక్క  ముఖ్య ఉద్దేశ్యము.

గతం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  చెరి సగం చెల్లించేవి, కానీ కేంద్ర ప్రభుత్వం ఈ

పధకం నుండి వైదొలగి తన వాటా గా చెల్లించాల్సిన  నిలపివేయడం వలన రాష్ట్ర

ప్రభుత్వమే భాద్యత తీసుకొని YSR బీమా పథకం 2020 -21 కొత్త పధకం ను ప్రవేశపెట్టడం జరిగింది మొత్తాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుంది.

సచివాలయ పరిధిలో ఉన్న అన్ని రైస్ కార్డులు  మొబైల్ యాప్ లో చూపడంలేదు.కావున రైస్ కార్డు సెర్చ్ ఆప్షన్ ద్వారా  చాలా సులువుగా బీమా  చేయొచ్చు 


YSR బీమా పథకములో నమోదుకై అర్హతలు:


· ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రైస్ కార్డ్ కలిగి ఉన్న వారు

 

· వయస్సు 18 నుండి 70 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు మాగాణి భూమి 2.5 ఎకరాలు లేదా

 

·  మెట్టభూమి 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్నవారు.

 

 వైస్సార్ బీమా 2020-2021 క్రొత్త గా నమోదు కార్యక్రమము లో Primary Brcad Earner (కుటుంబాన్ని పోషించే  వ్యక్తి) గుర్తించడం  పద్ధతి 

 

 

· చాలా కుటుంబాలలో రైస్ కార్డు లో ఇంటి  పెద్దగా  గా మహిళలు ఉన్నారు. కాని ఇంటిలో  సంపాదించే వ్యక్తిగా భర్త ఉంటారు . ఆ కుటుంబం లో భర్త ను సంపాదన పరుడు గా బ్రెడ్   ఏర్నేర్ గా ఉండటం  జరుగుతుంది . భార్య గాని పిల్లలు గాని లేదా వృద్ధులు అయిన తల్లి కానీ  తండ్రి గాని నామిని గా ఉంటారు.కొన్ని కుటుంబాలలో భర్త చనిపోయి ఆ  కుటుంభం  కొడుకు పై కుటుంబం ఆధారపడి ఉంటుంది. కొడుకు బ్రెడ్ ఏర్నేర్ గా  ఉంటాడు. ఇక్కడ అతని భార్య కాని  ,పిల్లలు గాని లేదా ఆమె కాని నామిని గా ఉంటారు కొన్ని చోట్ల భర్త చనిపోయి  కుటుంభం బాధ్యత మహిళే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది, ఇక్కడ ఆమె కుటుంబాన్ని  పోషించే  వ్యక్తి గా ఉండటం జరుగుతుంధి  పిల్లలు గాని లేదా వృద్ధులు అయిన కుటుంబ సభ్యులు కాని  నామిని   ఉండటం  

 

·  అక్కడక్కడ  కుటుంబంలో భర్త వికలాంగుడు అయితే భార్యే సంపాదిస్తూ ఉంటుంది. ఆ కుటుంబం లో భార్యే నే   కుటుంబాన్ని పోషించే వ్యక్తి  గా ఉండటం  జరుగుతుంది . పిల్లలు గానీ లేదా భర్త గాని  వారు నామిని గా ఉంటారు.

 

· కొన్ని కుటుంబాలలో  ఇద్దరు లేదా ముగ్గురు కూడా సంపాదిస్తూ ఉంటారు  వారిలో ఎవరిని కుటుంబాన్ని పోషించే వ్యక్తి గా ఆ కుటుంబం  మొత్తం నిర్ణయించుకుంటే మంచిది. నామిని గా కూడా ఎవరు ఉండాలని వారే నిర్నయించుకోవచ్చు  .

 

· అరుదు గా ఒక  కుటుంబంలో ఒక్క మహిళ గాని లేదా ఒక్కడే పురుషుడు గాని ఉంటాడు వారే కుటుంబాన్ని మొత్తం   పోషించే వ్యక్తి గా ఉంటారు కాని వీరికి నామిని గా లీగల్ హైర్  ఉంటారు.

 

· ఒక కుటుంబం లో భర్త మరియు భార్య ఇద్దరు కూలి చేసుకుంటూ ఉన్నారు అందులో ఎవరు కుటుంబాన్ని పోషించే వ్యక్తి పెట్టాలి అనేది వారి కుటుంబం నిర్ణయించుకుంటుంది  సహజంగా భర్త ఉంటాడు నామిని గా  భార్య  గాని పిల్లలు గాని ఉంటారు.

 

· సదరు (కుటుంబాన్ని పోషించే వ్యక్తి, తనకి ఇష్టమైన కుటుంబ సభ్యులను నామినీ నియమించుకోవలెను.

 

· ప్రై మరి  బెర్డ్  ఎర్నేర్ (కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) వివరములు వైఎస్సార్  బీమా యొక్క  మొబైల్ అప్లికేషను లో నమోదు చేయవలెను.

 

· కుటుంబాన్ని పోషించే వ్యక్తి జనధాన్ ఎకౌంటు ఉంటే ఈ క్రింద ఇవ్వబడిన వివరములు నమోదు చేయవలయెను  

 

· బ్యాంకు ఎకౌంటు నెంబర్

 

· IFSC CODE

 

 

నామిని ఈ క్రింద విధముగా నమోదు చేయవలెను:

 

· భార్య భర్త లేదా పిల్లలు , వీరి పై ఆధార పడిన వారు.

 

· ఒక వేళా నామిని మైనర్ అయితే సంరకుని నియమించాలి మైనర్ తరపున వారు వచ్చిన లబ్ధిని వారి సంరక్షణలో ఉంచుతారు 

· నామిని యొక్క SB A/c details సాధారణ ఖాతా మరియు IFSC వివరములు నమోదు చేయాలి.

 

·   bread earner మరియు నామిని యొక్క  వివరములు డాటా ఎంట్రీ చేసిన తర్వాతనే  బయోమెట్రిక్ అతంటికేషన్  వారి ఇరువురి నుండి తప్పనిసరిగా తీసుకోవాలి 

 

· YSR బీమా మొబైలు అప్లికేషన్ నందు Primary Bread Eamer తో కంపాలసరీ  ఆధార్  కేవైసీ  తప్పనిసరి గా చేయించవలెను.

 

·  YSR మొబైలు అప్లికేషన్ లో నమోదు చేసిన వివరములు తప్పనిసరిగా సేవ్  చేసుకోవలెను . వాలంటీర్ సేవ్  చేసిన అనంతరం ఆ డాటా బీమా వెబ్సైటు కు చేరడం  జరుగుతుంది 

 

· వాలంటీర్ సంబందిత Primary Bread Earner కు బ్యాంక్ ఖాతా లేనియెడల అతను లేదా  ఆమెకు జనధాన్ ఖాతా ను కచ్చితంగా   తెరిపించవలెను. అంతటితో నమోదు కార్యక్రమములో వాలంటీర్ యొక్క  పూర్తి భాద్యత పూర్తవుతుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ బీమా  ఐడెంటిటీ  కార్డ్స్  ను పాలసీదారునకు పంపిణీ చేస్తుంది.

 

 

YSR బీమా క్లెయిమ్ ప్రక్రియ : పాలసీదారు మరణించిన తరవాత చేయవలసిన పనులు

 

 

మరణించిన తరవాత కుటుంబ సభ్యులు కానీ వాలంటీర్ కానీ పాలసీదారు యొక్క వివరాలు WEA YSR Bima Facilitation Centers కు నమోదు కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియపరచాలి

 

మరణ నమోదు ప్రక్రియ రెండు రకాలు:

 

Village Secretariat b) జిల్లా సమాఖ్య కాల్ సెంటర్)

 

Village Secretariat  పరిధిలో మరణించిన వ్యక్తి యొక్క వివరములు గ్రామ/వార్డ్  వాలంటీర్ కుటుంబ సభ్యులు ఇతరులు ఎవరైనా సరే  Village/Ward Secretariat లో ఉన్నవెల్ఫేర్  కు ఫోన్ ద్వారా తెలియచేయవలెను, WEA డాటా ఎంట్రీ చేసి YSR Bima Facilitation Centres కు   జిల్లా సమాఖ్య కాల్ సెంటర్  కు క్లెయిమ్ రిజిస్ట్రేషన్  కొరకు పంపడం  జరుగుతుంది 


 

 జిల్లా సమాఖ్య కాల్ సెంటర్ సమాచారం 

 

 

మరణించిన వ్యక్తి యొక్క సగటు  వివరములు  బీమా మిత్ర వాలంటీర్ కు  కుటుంబ సభ్యలు ఇతరులు ఎవరైనా కాల్ సెంటర్ కు  ఫోన్ చేసి  మరణించిన వ్యక్తి యొక్క సమాచారం అందిచడం  జరుగుతుంది . టెలిఫోన్ ఆపరేటర్  యొక్క వివరములు అన్ని  రాసుకొని మరలా ఒక సారి  కన్ఫర్మేషన్  కొరకు WEA వాలంటీర్/ బీమా మిత్రల ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే బీమా   క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది.

 

ఇన్సూరెన్స్  కంపెనీ కు క్లెయిమ్ వివరములు సమర్పించుటకు కావలసిన  జీరాక్స్ పత్రములు

 

 

Claim Registration అయిన తర్వాతనే  Claim ID వస్తుంది.

 

బీమా మిత్ర  యొక్క  login నుండి క్లెయిమ్ ID ద్వార క్లెయిమ్ ఫారం పేపర్   ప్రింట్ తీసుకోవాలి వాటి పై

నామిన మరియు సాక్షి సంతకం  అనేది తీసుకోవాలి.

 

 

సహజ మరణము పొందిన వారు సమర్పించ వలసిన జీరోక్స్ పత్రములు

 

 

 

·  మొదటగా క్లెయిమ్ ఫారం.

 

· ఎన్రోల్మెంట్  పత్రం బ్యాంక్ నుండి తప్పనిసరిగా  పొందవలేను

 

·  insurance కంపెనీ కు బదిలీ అయినటు బ్యాంక్ స్టేట్మెంట్ పొందవలెను.

 

· బీమా మిత్ర నివేదిక (రిపోర్ట్).

 

· చనిపోయిన వ్యక్తి ఆధార్.

 

· నామినీ ఆధార్.

 

· డెత్ సర్టిఫికేట్.

 

· నామినీ సేవింగ్  బ్యాంకు అకౌంట్    (జన్ ధన్ ఎకౌంటు ఖాతా  పనికి రాదు అని  చెప్పవచ్చు )

 

· మరియు నామినీ యొక్క  డిశ్చార్జ్ రసీదు.

 

 

ప్రమాద మరణం క్లెయిమ్ కొరకు అవసరంఅగు  జిరాక్స్  పత్రాలు

 

 

· సహజ మరణమునకు తెలియ చేసిన పత్రాలకు అదనంగా

 

· ఎఫ్..ఆర్.

 

· శవపంచానామా

 

· శవ పరీక్ష నివేదిక పోస్టు మార్టం

 

· పోలిస్ ఫైనల్ రిపోర్ట్ (అనుమానాస్పద ప్రమాదాలలో).

 

· పోలీస్ శాఖ వారు మరియు  వైద్య మరియు ఆరోగ్య శాఖ వారు ఈ పత్రాలన్నీ ఆన్ లైన్ లో పంపించడం  జరుగుతుంది 

 

 

ప్రమాదం వలన కలిగిన అంగవైకల్యం క్లెయిములకు అవసరం అయిన పత్రాలు:

 

 

· క్లెయిమ్ దరఖాస్తు పత్రము (బీమా మిత్ర దగ్గర లభించును)

 

· పాలసీదారుని యొక్క ఆధార్ కార్డు

 

· FIR - కంప్లైంట్ లెటర్

 

· హాస్పటల్ డిశ్చార్జ్ సమ్మరి

 

· Hospital wounded certificate సదరం సర్టిఫికెట్

 

· CNS క్వస్చనీర్ (బీమా మిత్ర కాల్ సెంటర్ వారు ఇస్తారు)

 

· పాలసీదారుని ఫోటో (అవయవాలు తొలగించడం జరిగిన తరువాత)

 

· పాలసీదారుని సంతకంతో డిశ్చార్డ్ ఫారం

 

· పాలసీదారుని బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ.