YSR CHEYUTHA ELIGIBILITY CRITERIA👈
అర్హతలు
45-60 సంవత్సరముల మధ్య వయస్సు లో ఉన్న ఎస్.సి /ఎస్.టి.బి.సి. మరియు మైనారిటీ మహిళల స్వయం ఆర్ధిక సాధికారత కొరకు సంవత్సరానికి రూ.18,750 వేల చొప్పున నాలుగు సంవత్సరాలలో 75,000 వేలు వై.యస్.ఆర్. చేయూత పథకం ద్వారా సహాయం అందించబడుతుంది
· మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000 మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000 కంటే తక్కువ ఉండాలి.
· మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి(తరి ) భూమి లేదా 10 ఎకరాల మెట్ట భూమి లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.
· కుటుంబం మొత్తములో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు (పారిశుధ్య కార్మికులకు ప్రతేక మినహాయింపు).
· కుటుంబం నివసిస్తున్న గృహం యొక్క (సొంతంమరియు అద్దె) యొక్క నెలవారీ విద్యుత్ వినియోగ బిల్లు 300 యూనిట్లు లోపు కల్గి ఉండవలెను. (గత ఆరు నెలల విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సరాసరి సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువఉండవలెను.)
· పట్టణ ప్రాంతంలో నిర్మాణపు స్థలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి.
· కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 వీలర్ (నాలుగు చక్రములు) సొంత వాహనము ఉన్నట్లయితే (ఆటో, టాక్సీమరియు ట్రాక్టర్ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించవలెను.
· కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే వారు వుండరాదు.
· ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
· ప్రభుత్వం జారీచేసిన సమగ్ర కులధృవీకరణ పత్రం (S.C., S.T., B.C., Minority) కలిగి ఉండవలెను.
దరఖాస్తు చేసుకొనే పద్ధతి
· అర్హత కల్గిన వారు మీ సమగ్ర కులధృవీకరణ పత్రం మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు స్వయంగా మీ దగ్గర లోని గ్రామ/వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చును.
· ఈ సంవత్సరం గ్రామ/వార్డ్ వాలంటీర్ లాగిన్ లో మిస్ ఆయన పేరులు అని కుడా గ్రామ/వార్డ్ సచివాలయం లో వారికీ గ్రీవెన్స్ రైజ్ చేయటం జరిగింది అల గ్రీవెన్స్ రైజ్ చేసి అర్హులు ఎవరితై ఉన్నారో వారి అందరి పేరులు కుడా వెల్ఫేర్ లాగిన్ లో రావటం జరిగింది పేజీ లో మనం పూర్తిగా గా తైలుసుకుందాం