YSR RYTHU BHAROSA-PM KISAN ELIGIBILITY CRITERIA👈

  ప్రయోజనాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగు సమయంలో రైతుల ఆర్ధిక సమస్యలను తగ్గించి అధిక ఉత్పత్తి

 సాధించుటకై ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 13,500/- పెట్టుబడి సహాయం ఐదు

 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి సహాయం రూ.67,300/-

భూ పరిమాణంతో సంబంధం లేకుండ  అర్హులు అయినటువంటి రైతులందరికి పిఎం కిసాన్ లబ్ది

 ఆరు వేలతో కలిపి మూడు వాయుదలలో సంవత్సరానికి 13,500  పెట్టుబడి సహాయం

అర్హతలు

· వెబ్ లాండ్ డేటా అథారంగా భూమి పరిమాణంతో సంబంధం లేకుండా రైతుల గుర్తింపు

 

· ఆర్..ఎఫ్.ఆర్ మరియు డి పట్టా భూములను కల్గి  (సంబంధిత రికార్డులలో నమోదైన వాటిని)సాగుచేయుచున్న రైతు కుటుంబాలు.

 

· పరిహారం  మొత్తము చెల్లించకుండా స్వాధీనం చేసుకున్న భూములను సాగు చేస్తున్న  రైతులు.ఎస్సీ,ఎస్టీ, బీసీ, మరియు మైనారిటీకి చెందిన సొంత భూమి లేని సాగుదారులు, వ్యవసాయ, ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ పంటలను కనీసం ఒక ఎకరం , పువ్వులు మరియు పశుగ్రాస పంటలు కనీసం సగటు  0.5 ఎకరం లేదా కనీసం 0.1 ఎకరం తమలపాకు సాగు చేయుచున్నచో అట్టి  వారు సాగుదారులు అర్హులు.

 

· ఒక భూ యజమానికి ఒకరి కన్నా ఎక్కువ మంది కౌలు రైతులు ఉంటే, అందులో మొదటి ప్రాధాన్యత షెడ్యూల్డ్ తెగకు చెందిన కౌలు రైతుకు ఇవ్వబడుతుంది. తరవాత ప్రాధాన్యతా క్రమంలో షెడ్యూల్డ్ కులం, వెనకబడిన మరియు మైనారిటీ తరగతికి చెందినవారు ఉంటే వారికి ఇవ్వబడుతుంది.

 

· గిరిజన ప్రాంతాలలో  గిరిజన చట్టాలు అనుగుణంగా  ఆధారంగా గిరిజన సాగుదారులను మాత్రమే గుర్తించటం జరుగుతుంది.

 

· ఒకే ఊరిలో ఉన్న సన్న కారు రైతు మరియు భూమి లేని సాగుదారుల మధ్య గల కౌలు ఒప్పందం చెల్లదు.దేవాదాయ శాఖ నమోదుల ఆధారంగా దేవాదాయ భూములను సాగు చేస్తున్న సాగుదారులు లబ్ధిని పొందడానికి అర్హులు.

 

· రైతు కుటుంబంలో పెళ్ళికాని ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఆదాయ పన్ను చెల్లించేవారు ఉన్నాకూడా సంబంధిత రైతు మినహాయింపు వర్గంలో లేకపొతే అతను వై.యస్.ఆర్ రైతు భరోసాకి అర్హుడు.

· ఈ పథకం క్రింద వారికి  చేసే  సహాయం చేసే మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకుఅకౌంట్  ఖాతాలకు బదిలీ చేస్తారు.

· వైయస్ఆర్ రైతు భరోసా సంక్షేమ పథకం  ద్వారా  రాష్ట్ర స్థాయి  సంక్షేమ పథకం మరియు అర్హత  కల్గి ఉన్న  ప్రతి రైతులు సున్నావడ్డీ రుణాలు పొందగలిగే అర్హులైన ప్రతి  రైతులను ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనం  లబ్ది చేకూరుస్తుంది .

· కౌలు రైతులకు కూడా ఈ సంక్షేమ పథకం  వర్తిస్తుంది. కౌలు  రైతులు ఈ పథకం కింద సుమారు  సంవత్సరానికి మొత్తం  2500 రూపాయలు పొందుతారు 

· వ్యవసాయం పైన ఆధారపడినవారికి రైతుకు  జీవిత బీమా  సౌకర్యం కూడా ఇవ్వబడుతుంది, ఇది రూ. 5 లక్షలు రూపాయలు మరియు అలాగే, ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుంది.

· డెయిరీలు తిరిగి మల్లి  తెరవబడతాయి మరియు పెండింగ్ లో ఉన్న అనేక నీటిపారుదల ప్రాజెక్టులు సకాలం లో 
పూర్తవుతాయి.

· రైతు భరోసా పథకానికి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి

· మీకు ఇంకా సహాయం కావాలంటే మీ  గ్రామా వార్డు సచివాలయం లో సంప్రదించండి

 

అనర్హులు :

1. ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు పథకం వర్తించదు. మేయర్లు, జడ్పీ ఛైర్మన్లకు ఇతర ప్రజా ప్రతినిధులకు ఈ పథకం వర్తించదు

2. వ్యవస్థీకృత భూ యజమానులకు ఈ పథకం వర్తించదు

3. వృత్తిపరమైన సంస్థల కింద రిజిస్టర్ నమూదు  అయి.. తమ వృత్తులను కొనసాగిస్తూ గత ఏడాది కాలానికి ఆదాయ పన్ను చెల్లించిన డాక్టర్లు

4. నెలకు రూ. 10 వేలు మరియు  అంతకు మించి పెన్షన్ పొందుతున్న వారు అనర్హులు

5. ప్రభుత్వరంగ సంస్థలు, వాటి అనుబంధ కార్యాలయాలు, ప్రభుత్వ పరిధిలోకి వచ్చే స్వతంత్ర సంస్థల ఉద్యోగులు, స్థానిక సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు

ఆర్థిక సాయం  

సాగు సమయంలో రైతుల ఆర్థిక సమస్యలను తగ్గించి మరియు అధిక ఉత్పత్తి సాధించుట కొరకు, ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 13,500 రూపాయలు  పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఇందులో భాగంగా కేంద్రం రూ. 6 వేలు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,500 ఇస్తుంది

 

మొదటి విడత సాయం  

ప్రతి ఏటా మే నెలలో అక్షరాలా రూ. 7,500 ( పి యం కిసాన్ 2,000 కలిపి)

రెండవ విడత సాయం :

ప్రతి ఏటా అక్టోబర్ లో రూ. 4,000 ( పి యం కిసాన్ 2,000 కలిపి)

మూడవ విడత  సాయం :

ప్రతి ఏటా జనవరిలో రూ. 2,000 ( పి యం కిసాన్ ఇస్తుంది