YSR VAHANAMITRA ELIGIBILITY CRITERIA👈

  

అర్హతలు

ఆటో, ట్యాక్సీ,(ఎల్లో బోర్డు ) మరియు మ్యాక్సీ- క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 10,000/- బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మత్తులు మొదలైనవాటికి ఖర్చుల నిమిత్తం వాహన మిత్ర పధకం ద్వారా సాయం 

 

ఆర్ధిక సహాయం

· దరఖాస్తుదారుడు స్వీయ యాజమాన్యంలోని ఆటో, ట్యాక్సీ, మరియు మ్యాక్సీ- క్యాబ్ డ్రైవర్ అయి ఉండవలెను.

 

·  ఆటోరిక్షా / లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి దరఖాస్తుదారుడు  చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

 

·  ఆటోరిక్షా/ట్యాక్సీ, మరియు మ్యాక్సీ - క్యాబ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు ఎర్టి క్యాబ్స్ విషయంలో పన్ను వంటి చెల్లుబాటు అయ్యేరికార్డులు కలిగి ఉండాలి.

 

· ఈ పధకం, ప్యాసింజర్ ఆటోరిక్షా మరియు ట్యాక్సీ, మరియు మ్యాక్సీ -క్యాబ్  వంటి యజమానులకు వర్తిస్తుంది. త్రీ వీలర్ మరియు  ఫోర్ వీలర్ లైట్ గూడ్స్ వాహనాల యజమానులు ఈ పధకం క్రింద వీరు అర్హులు కారు.

 

· ప్రతి దరఖాస్తుదారుడికి ఆధార్ కార్డు కలిగి ఉండాలి.

 

· యజమాని తప్పనిసరిగా బియ్యం కార్డు (బిపిఎల్ / వైట్ రేషన్ కార్డు/ అన్నపూర్ణ కార్డు/ అంత్యోదయ కార్డు ) కలిగి ఉండాలి

 

· కుటుంబం అంటే భర్త అలాగే  భార్య మరియు  మైనర్ పిల్లలు. కుటుంబంలో ఒక వాహనానికి సంబంధించి   ఆటోరిక్షా మరియు ట్యాక్సీ, మరియు మ్యాకీ- క్యాబ్ మాత్రమే ఈ పధకం క్రింద  వారికీ ప్రయోజనం పొందడానికి అర్హులు.

· ఒకే బియ్యం / వైట్ రేషన్ కార్డు లో  కల్గిన  వేర్వేరు వ్యక్తులపై యాజమాన్యం మరియు లైసెన్స్ ని  అనుమతించబడుతుంది. ఏది ఏమైనా ఒకే బియ్యం / వైట్ రేషన్ కార్డు లో భార్య భర్త మరియు మైనర్ పిల్లలతో కూడిన ఆ కుటుంబం లో ఒక వ్యక్తి  కి మాత్రమే ఆర్ధిక సహాయం పొందుటకు  అర్హులు.

 

· లబ్ధి దారుడు తండ్రి / తల్లి/కుమార్తె / సోదరుడు మరియు డ్రైవింగ్ లైసెన్స్ మేజర్ కుమారుడు / కుమార్తె పేరిట ఉంటే , వాహనం యొక్క రిజిస్టర్ యజమాని ఐనా తండ్రి / తల్లి / కుమార్తె / సోదరుడు ప్రయోజనం పొందడానికి అర్హులు. వారి పేర్లు వేర్వేరు బియ్యం కార్డు మరియి వైట్ రేషన్ కార్డు లో ఉన్నప్పటికి అర్హులు.

 

· ఇతర రాష్టాలు జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లను కలిగి ఉన్న లబ్ధి దారులు సంబంధిత ఆర్ టి వో కార్యాలయాలో చిరునామా మార్పు కోసం ధరఖాస్తు చేసుకోవాలి.

 

· ధరఖాస్తు సమయంలో వాహనం యజమాని వద్ద  కల్గి ఉండాలి

 

· కొత్త లబ్ధి దారుల ధరఖాస్తులను గ్రామ / వార్డు వాలంటీర్లు సేకరించి వారి అర్హతలను ధృవీకరిస్తారు.

 

· బ్యాంక్ ఖాతా వాహనం యజమాని పేరుమీద ఉండాలి. లబ్ధి దారుడి  యొక్క బ్యాంక్ ఖాతా షెడ్యూల్ చేసిన వాణిజ్య బ్యాంకులలో ఎదో ఒకటి కావచ్చు. బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజీ జీరాక్స్  సమర్పించాలి .

 

· ఎస్సీ , ఎస్టీ , బీసీ మైనారిటీల కమ్యునిటీ విషయంలో కుల దృవీకరణ పత్రం ఉన్నచో ధరఖాస్తు తో పాటు  జతపరచవలెను .

 

· వాహనం బార్య పేరిట ( డ్రైవింగ్ లైసెన్స్ కలిగి లేదు ) ఉండి భర్త  నడుపుతుంటే ( భర్త కు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నచో ) అలాంటి ధరఖాస్తు దారులను కూడా అర్హులుగా పరిగణిస్తారు.

· ఈ పథకం యొక్క పూర్తి ఆన్లైన్ ప్రాసెస్ అనేది సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కావాలి నవశకం లాగిన్ లో ఓపెన్ అవుతుంది.

 

  జాబితాలో పేరులేని వారు ధరఖాస్తు చేసుకునే విదానము

 

 

· కొత్త లబ్ధి దారుడు  దగ్గర లో గల  గ్రామ / వార్డు వాలంటీర్ల నుండి ధరఖాస్తులను  తీసుకోవచ్చును  లేదా

·  www.navasakam.ap.gov.in వెబ్సైట్ నుండి  ధరఖాస్తును గ్రామ వార్డు

·  వాలంటీర్ల వద్ధ దాఖలు చేయవచ్చును

· ధరఖాస్తు చేసిన లబ్ధి దారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్నీ  సకాలం  లో పూర్తి చేసి అర్హ్త కలిగిన వారికి పథకం  వర్తింప జేయడం 

·  సంవత్సరానికి ఒక్క సారి మంజూరు చేసే వైయస్ ఆర్ వాహన మిత్ర పధకం ద్వారా లబ్ధి

·  చేకూర్చ బడుతుంది.