EBC Nestham ELIGIBILITY CRITERIA👈

 



ఈబీసీ పథకం ద్వారా అగ్రకులాలకు చెందినటువంటి అర్హత కలిగిన  ప్రతి మహిళ కు  45 - 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలకి ప్రతి ఏటా పాద హైదు వేల రూపాయలు చొప్పున మూడు సంవత్సరాలలో 45000 వేలు  రూపాయలు ఇవ్వనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం ఒక్క  సంవత్సరానికి 670 కోట్ల  నుంచి 600 కోట్లు చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్  మూడు సంవత్సరాలకు కలిపి  1810 నుంచి 2011 కోట్లు  ప్రభుత్వం కేటాయించడం జరిగింది.


EBC నేస్తం అనే పథకం  ఏపీ  ప్రభుత్వం నూతనంగా పప్రవేశపెట్టడం జరిగింది . అందులో భాగంగా ఈ ఆర్ధిక  సంవత్సరం 2021-22 నుంచి కొత్త అప్లికేషన్ల దరఖాస్తు చేయడం జరుగుతుంది మధ్య  వయ్యాసు వున్న  మహిళలకు ఆర్థికంగా చేయూత ఇవ్వటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం 

ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి పదహైదు  వేల రూపాయలు చొప్పున మొత్తం మూడు విడతలుగా అనగా
మూడు
 సంవత్సరాలకు 45 వేల రూపాయలు ఆర్థిక సాయం లబ్ధి చేకూరుతుంది 

2021-22 సంవత్సర ఈబీసీ నేస్తం అనే  పథకానికి సంబంధించి ముందుగా ఉన్న వారి అర్హత, అనర్హతలను

మరియు కొత్తగా పథకానికి అర్హత ప్రమాణాలతో కూడిన గైడ్ లైన్స్ ను ప్రతి జిల్లా కలెక్టర్
మరియు 
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ బీసీ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ) వారికీ 
అందించడం 
జరిగింది. అందులో తెలియజేసిన పథకం యొక్క అర్హత ప్రమాణాలు మరియు  టైం లైన్ లను
ప్రభుత్వం ఆమోదం తెలిపింది 

అర్హతలు 


  • సగటు కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు 10,000 వేలు రూపాయలు  దాటకూడదు అదేవిధంగా పట్టణాలలో అయితే నెలకు 12000 వేలు రూపాయలు దాటకూడదు.

  • ఈ కుటుంబం మొత్తానికి పల్లపు భూమి (తరి) మూడు ఎకరాలు కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాలు కన్నా తక్కువ ఉండాలి పల్లపు భూమి (తరి) మరియు మెట్ట భూమి రెండు కలిపి పది ఎకరాల కన్నా తక్కువగా  ఉండాలి.

  • కుటుంబం మొత్తములో  ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్  కడుతున్నవారు  ఉండకూడదు.

  • మునిసిపాలిటీ లో 750 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం మించి   ఉండకూడదు

  • GO విడుదలైన రోజు కు 45 నుంచి 60 సంవత్సరాలు వయస్సు నిండిన ఈ బీసీ మహిళలు వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడం కోసం ఆర్థిక సహయం అందించడం ప్రభుత్వ్యం ఉద్దేశం 

  • ఆటో, టాక్సీ,టాక్టర్ మినహా కుటుంబంలో ఎవరి పేరు మీద నాలుగు చక్రాల (వైట్ బోర్డు ) వాహనం ఉండకూడదు

  • వైయస్సార్ చేయూత, కాపు నేస్తం లో కవర్ అయినా ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనారిటీ వారు ఈ  పథకానికి  అనర్హులు

  • అర్హులైన మహిళ పేరు మీద ఆధార్ కార్డు కలిగి  ఉండాలి

  • OC EBC కమ్యూనిటీకి చెందిన మహిళలు అయ్యి  ఉండాలి.

  • కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఉండకూడదు ( పారిశుద్ధ్య కార్మికుల కు మినహాయింపు ఇవ్వడం  జరిగింది )

  • వయసు ధ్రువీకరణ పత్రాలు : ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ / డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ / టెన్త్ మార్క్స్ మెమో / ఓటర్ ఐడి కార్డ్ ఏదో  ఒకటి  కలిగి  ఉండాలి 




అర్హత గుర్తింపు 

  • గ్రామ వార్డు వాలంటీర్ వారు డోర్ టు డోర్ ( ఇంటింటా ) వెళ్లి  సర్వే చేసి  అర్హులను గుర్తించి ఏ సమయంలో వాలంటీర్  వారికి పైన తెలిపిన అర్హతలు అన్నీ కూడా తెలిసి ఉండాలి

  • వాలంటీర్లు సర్వే చేసిన డేటా  తర్వాత సచివాలయం లో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు వాలిడేషన్ చేస్తారు.

  •  తరువాత సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్  వారు అర్హతలను పరిశీలించి అప్లికేషన్లను తనిఖీ చేస్తారు.


కావాల్సిన  పత్రాలు 

  • ఆధార్  కార్డు 

  • హస్బెండ్  ఆధార్  కార్డు. 

  • క్యాస్ట్ సర్టిఫికెట్. 

  • ఇన్కమ్ సర్టిఫికెట్

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ. 

  • భూమి ఉంటే 1బి
     
  • రైస్ కార్డు 

  •  బ్యాంకు పాసుబుక్ పేజీ 


టైం లైన్ ప్రాసెస్ తేదీలు 

  • తేదీ 29-9-2021 నాటికి 45 సంవత్సరాలు నిండిన EBC మహిళల వారి సమాచారం సేకరించాలి 

  • 08-10-2021 నుంచి 10-10-2021 అర్హత ప్రమాణాలకు అనుగుణంగా వాలంటీర్ వారు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలి, సర్వే చేసిన  సమాచారాన్ని వెల్ఫేర్ అసిస్టెంట్ వారు పరిశీలన చేసిన తర్వాత సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ వారికి ఫార్వర్డ్ చేయాలి. మొబైల్ అప్లికేషన్ ను వారు APCFSS వారు  డెవలప్ చేస్తారు.

  • 11-10.2021 నుంచి 13-10-2021 

    MPDO/MC వారు సిద్ధం చేసిన లిస్టు ప్రకారం సోషల్ ఆడిట్ టీమ్ వారు ఆడిట్ చేస్తారు

  • 14-10-2021 నుంచి 16-10-2021 

    ఆడిటర్ రిపోర్టు ప్రకారం అనర్హుల పేరును సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ వారు తొలగించగా మిగిలిన లిస్టులను సచివాలయంలో అభ్యంతరాల స్వీకరణ కొరకు హ్యాంగ్ చేస్తారు.

  • 17-10-2021 నుంచి 18-10-2021 

    అభ్యంతరాల స్వీకరణ అయిన తరువాత MPDO/MC వారు లిస్టులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, DBCSCS Ltd.వారికి ఫార్వర్డ్ చేయాలి.

  • 19-10-2021 నుంచి 21-10-2021

    ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, DBCSCS Ltd. వారు జిల్లా కలెక్టర్ వారి నుంచి ఆమోదం తీసుకొని వాటిని ఈ బీసీ నేస్తం అనే పోర్టల్ ద్వారా ఏపీ  గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారికి ఫార్వర్డ్ చేయాలి

  • తర్వాత  ప్రభుత్వం కేటాయించిన  తేదీనాడు లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ అవ్వుతుంది