RICECARD EKYC

 




ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం  కొత్తగా  రేషన్  కార్డు ను  రద్దు  చేసి  రైస్  కార్డు  వ్యవస్థ  తీసుకొచ్చింది  అదేవిధంగా రైస్ కార్డు లో వున్నా సభ్యులందరు కంపల్సరీ EKYC  చేపించు  కోవాలి ఇప్పటి  చాల మంది  EKYC  చేపించు  కోలేదు  దయచేసి  అందరూ  EKYC  చేపించుకోవాలి 


కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు  కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు    EKYC  చేపించుకోవాలి  అంతే  కార్డులు తొలగించడం ప్రభుత్వ ఉద్దేశ్యం   కాదు  EKYC  చేపించుకున్నవారందరికి  వెంటనే రేషన్  ఇస్తాము  మిగిలిన కుటుంబసభ్యులు ఎప్పుడు EKYC   నమోదు చేసుకుంటే వెంటనే వారికి  రేషన్ 

 పంపిణి  చేస్తాము పెద్దలకు ఈనెల  ఆఖరు వరకు, పిల్లలకు సెప్టెంబరు  నెల  చివరి  వరకు గడువు పొడిగించడం  జరిగింది  ఉంది.ఐదేళ్లలోపు పిల్లలకు ప్రస్తుతం అవసరం లేదు ఎక్కువ మంది మిగిలిపోతే ప్రభుత్వం ముఖ్య మంత్రి  గారి  దృష్టికి తీసుకెళ్లి సమయం పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తాం. గత ఏడా దిన్నరగా నుంచి   ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం  చేస్తున్నాం.ఈకేవైసీ చేయించుకుంటే దేశంలో ని ఏ ప్రదేశం లో  అయినా  ఎక్కడైనా వేలిముద్ర వేసి రేషన్ పొందవచ్చు  రాష్ట్రంలో ప్రస్తుతం చాల  ఆధార్ నమోదు కేంద్రాలుమీ  దగ్గరలో  అందుబాటులో  ఉన్నాయి.అన్ని గ్రామ/వార్డు సచివాలయాలనూ ఆధార్ నమోదు కేంద్రాలుగా  గుర్తించి  ప్రజలకు  రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి తెలిపాము  ఆధార్ వేలిముద్రలు  ఆరిగిపోవడం  వలన సరిగా పడనివారు రేషన్ దుకాణంలో ఉండే ప్యూజన్ ఫింగర్ అనే  సదుపాయాన్ని వినియోగించుకుని ప్రతి  ఒక్కరు  ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.బయోమెట్రిక్ రికార్డు కాని వారు మాత్రమే మీ  దగ్గర  లోని  ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లాలి.  


రైస్  కార్డు  EKYC  చేయు విధానం 

  • మీకు  మ్యాప్  చేసుకున్నా  వాలంటీర్ ద్వారా సివిల్  సప్లెస్  వారి AEPDS మొబైల్ యాప్ ద్వారా  ఆధార్ e-KYC నమోదు ప్రక్రియ ఆగష్టు 20లోపు పూర్తి చేసుకొనవలెను.
  • ఎవరైనా వృద్దులు లేదా రోజువారి కూలి పనులు చేసుకొను వారి వేలి ముద్రలు అరిగి పోయి  సరిగా నమోదు కాని యెడల చౌకధరలదుకాణం నందు గల e-PoS మెషిన్ నందు గల FUSION FINGER గల   ఆప్షన్ వినియోగించి ఆధార్ e-KYC నమోదు ప్రక్రియ పూర్తి చేసుకొనవచ్చును
  • ఒకవేళ ఎవరికైన FUSION FINGER అనే   ఆప్షన్ ద్వారా కూడా వేలి ముద్రలు సరిగా పడని  యెడల వారు వారికి  దగ్గర  సమీపము నందు గల ఆధార్ నమోదు కేంద్రం నందు సందర్శించి  వారి వేలి ముద్రలను మరల నమోదు చేసుకొని మరల  e-KYC నమోదు ప్రక్రియను ఆగష్టు మాసములోపు  చివరి లోపు  పూర్తి చేసుకొనవలెను
  • చిన్న పిల్లల ఆధార్ నమోదు చేసుకునేటప్పుడు  వారి వేలి ముద్రలకు బదులుగా తల్లి తండ్రుల వేలి ముద్రలతో వారికి ఆధార్ ఎన్రోల్ మెంట్  అయ్యి  వారికి ఆధార్ కార్డులను జారిచేయుట  జరిగినది అట్టి వారి వేలి ముద్రలను ఆధార్ e-KYC నమోదు చేసుకొనుటకు ముందుగామీ  దగ్గర  లోని   ఆధార్ కేంద్రలనందు వారి వేలి ముద్రల నవీకరణ చేసుకోవలెను తర్వాత వారి  ఆధార్ e-KYC నమోదు ప్రక్రియ పూర్తి చేయవలెను. అయితే వీరి కి సెప్టెంబరు మాసము నెల  చివరి వరకు అవకాశం కల్పించడం  జరిగినది
  • e-KYC నమోదు ప్రక్రియను పూర్తి చేయని యెడల వారిని  బోగస్ సభ్యులుగా గుర్తించి వారికి సెప్టెంబరు మాసము  సంబంధించిన కోట  నిత్యావసర సరుకుల సరఫరాను నిలిపివేయట జరుగును  మరియు వారి యొక్క పేర్లను రైసు కార్డు లో  EKYC  చేపించుకోనివారికి ఇనాక్టివ్ ఉండును  వారు  EKYC  వేపించుకున్న  తర్వాత  మళ్ళీ యాక్టీవ్  చెయ్యడం  జరుగుతుంది  
  • గతంలో చాల కార్డులకు చైల్డ్ డిక్లరేషన్, మైగ్రాంట్ డిక్లరేషన్ చేసిన వారికి YES స్టేటస్ ఉన్నా సరే ఆ పేరు పైన క్లిక్ చేసి మరలా ఇప్పుడు Ekyc ఎవరైతే పెరు కలవారు ఉంటారో వారితో మళ్ళి  ekyc వేయించండి. 
  • 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్  చేయించు కోమని  చెప్పండి. వేలిముద్రలు అప్డేట్ అయ్యాక వారితో  మళ్ళి ekyc చేయించండి 5సంవత్సరాలు నిండని పిల్లల గురించి  ప్రభుత్వం  ఇంకా పూర్తి వివరాలు తెలపలేదు 

e-KYC చేయు సమయములో చాల ఎర్రర్స్  వచ్చినప్పుడు  మీ దగ్గర లో వున్న ఆధార్ నమోదు కేంద్రం నకు వెళ్లి ఆధార్ అప్డేట్ చేపించుకోవాలి 

  • 330 ఆధార్ లాక్ అవ్వడం వలన వచ్చును మీరు దగ్గర లోని ఆధార్ నమోదు కేంద్రం నకు వెళ్లి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి
  • 811 గల ఎర్రర్ ఆధార్ నమోదు కేంద్రం నకు వెళ్లి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి
  • 300 ఎర్రర్ వచ్చినప్పుడు ఆధార్ తప్పుగా నమోదు అవ్వడం వలన మరియు ఒకరి ఆధార్ నెంబర్ కు బదులుగా వేరొక వ్యక్తి వేలిముద్రలు వేసినప్పుడు వచ్చును కావున eKYC చేయు సమయంలో వారి  పేర్లు సరి చుసుకోనవలెను.