YSR KALYANAMASTHU AND YSR SHAADI TOHFA SCHEME DETAILS
వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకం తీసుకొచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. పేదింటి ఆడపడుచులకు పెళ్లి కానుక కింద నగదును వైయస్సార్ కళ్యాణమస్తు మరియు వైయస్సార్ షాది తోఫా పథకాల ద్వారా అందించడం జరుగుతుంది
వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కింద అందించు నగదు
ఏ కులానికి | ఎంత |
---|---|
ఎస్సీ | 1,00,000 |
ఎస్సీ కులాంతర వివాహం | 1,20,000 |
ఎస్టీ | 1,00,000 |
ఎస్టీ కులాంతర వివాహం | 1,20,000 |
బీసీ | 50,000 |
బీసీ కులాంతర వివాహం | 75,000 |
మైనారిటీ | 1,00,000 |
దివ్యాంగులు | 1,50,000 |
భవన నిర్మాణ కార్మికులు | 40,000 |
వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నగదు ఎప్పుడు జమ అవుతుంది?
వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకానికి సంబంధించిన నగదు అనేది అర్హులైన లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం నాలుగు నెలలలో ఏదో ఒక నెల జమ అవ్వటం జరుగుతుంది. ఆ నెలలు ఫిబ్రవరి,మే,ఆగస్టు మరియు నవంబర్. అని లబ్ధిదారుల వెరిఫికేషన్ అనేది పై నెలలో కన్న ముందుగా వెరిఫికేషన్ అయినట్లయితే పైన ఉన్న నెలలో నగదు జమ అవుతుంది. ఉదాహరణకు ఒక లబ్ధిదారుని వెరిఫికేషన్ అనేది జనవరి నెలలో పూర్తి అయినట్టు అయితే వారికి ఫిబ్రవరిలో నగదు జమ అవ్వటం జరుగుతుంది
వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా అర్హతలు
- పెళ్లి అయిన రోజు నాటికి పెళ్లికూతురుకు 18 సంవత్సరాలు వయసు మరియు పెళ్ళికొడుకు 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి
- పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు కనీసం పదవ తరగతి కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి
- మొదటి పెళ్లికి మాత్రమేఈ పథకం వర్తించనుంది వితంతువు అర్హులు ఒకే ఇంట్లో ఇద్దరు వితంతువులు ఉన్నట్టయితే ఒకరికి మాత్రమే అవకాశం కలదు
- వరుడు వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 మించరాదు,పట్టణాలలో 12,000 మించరాదు.
- కుటుంబం మొత్తానికి మెట్ట భూమి 3 ఎకరాలు , పల్లపు భూమి 10 ఎకరాలు, రెండూ కలిపి 10 ఎకరాలకు మించి ఉండరాదు.
- 3 ఎకరాలకు మించి మాగాణి, లేదా 10 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండవచ్చు
- కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పెన్షనరు, కేంద్ర ప్రభుత్వం, PSU, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ ఆర్గనైజేషన్లో పనిచెయ్యరాదు . పారిశుద్ధ్య కార్మికులకు దీని నుంచి మినహాయింపు ఇవ్వటం జరుగుతుంది
- కుటుంబంలో ఎవరు కూడా నాలుగు చక్రాల వాహనం కల్గి ఉండకూడదు. టాక్సీ,ఆటో,ట్రాక్టర్ మినహాయింపు
- నెలసరి కరెంటు యూనిట్లు మూడు వందల యూనిట్లకు మించి ఉండరాదు. గడిచిన 12 సంవత్సరాలు సరాసరి తీసుకోవడం జరుగుతుంది. కరెంటు బిల్లు గత 12 నెలలువి లేకపోయినా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది.
- పట్టణ పాంత్రాలలో మునిసిపాలిటీలలో ఆస్తి 1000 చదరపు అడుగులకు మించి ఉండరాదు.
- ఇరువురి కుటుంబాలు ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు
వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా అప్లికేషన్ చేయటానికి కావలసిన డాక్యుమెంట్లు
- పెళ్లి కార్డు మరియు పెళ్లి ఫోటోలు
- వివాహ ధ్రువీకరణ పత్రము
- కుల ధ్రువీకరణ పత్రము(cast )
- పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరివి పదవ తరగతి పాసు సర్టిఫికెట్
- వికలాంగులు అయితే శాశ్వత వికలాంగతత్వం ఉన్న సదరం సర్టిఫికెట్ కావాలి
- వితంతువు అయితే ముందు ఉన్న భర్త మరణ ధ్రువీకరణ పత్రము, వితంతు పెన్షన్ కార్డు రెండు లేకపోతే అప్పుడు ఆఫీడివిటి ఉండాలి.
- అప్లికేషన్ చేయు సమయంలో పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరూ ఈ కేవైసీ ఇవ్వవలసి ఉంటుంది
- కార్మికుల కుటుంబానికి సంబంధించిన దరఖాస్తుదారులు అయితే కార్మిక శాఖ నుంచి పొందిన గుర్తింపు కార్డు