Jagananna Aarogya Suraksha



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల ఆరోగ్య పరిస్థితుల పై డోర్ టూ డోర్ సర్వే చెయ్యడం జరుగుతుంది అలాగే హెల్త్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈ హెల్త్ క్యాంపు లో అవసరమైన వారికి ఉచితంగా చికిత్స చెయ్యటం జరుగుతుంది 

ఆరోగ్య సురక్ష సర్వే కి అవసరమైన లింక్స్ మరియు అప్లికేషన్స్ క్రింద ఇవ్వడం జరిగింది


Pre & post రెండు విడతల్లో  సిటిజెన్స్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత వాలంటీర్ ఆ హౌస్ హోల్డ్ నుండి ఒకరితో Biometric/Irish/Facial/OTP ద్వారా ఈకేవైసీ తీసుకోవాలి

జగనన్న సురక్ష  వాలంటీర్లు  చేయవల్సిన పనులు

➤ వాలంటీర్లు తన క్లస్టర్ పరిధిలోని ఉన్న ప్రతి ఇంటిని 2 సార్లు సందర్శించవలసి ఉంటుంది ఆరోగ్యం సురక్ష క్యాంపు కి 20 రోజులు ముందు ఒకసారి మళ్లీ క్యాంపు కి 7 రోజులు ముందు రెండోసారి సందర్శించవలసి ఉంటుంది
➤ గ్రామ వార్డు వాలంటీర్లు ఈ సర్వేను GSWS VOLUNTEER అను అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని సర్వే కంప్లీట్ చేయాలి
➤ మొదటి రౌండు పూర్తయిన తర్వాత ANM వారు ప్రతి ఇంటిని సందర్శించి వారికి అవసరమైన టెస్టులు చేసి  తదుపరి డాక్టర్ కన్సల్టేషన్ కొరకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది ఆ టోకెన్ తీసుకొని  క్యాంపు రోజు వస్తే డాక్టర్లు పరీక్షించి మీకు వైద్యం చేయబడును 
➤ రెండవ రౌండ్లో వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలోని ఇళ్ళకి వెళ్లి ANM వారు మీకు టెస్టులు చేశారా లేదా అని అప్లికేషన్లో సర్వే చేయవలసి ఉంటుంది అలాగే  క్యాంపు నిర్వహించే డేటును  సిటిజన్ కు తెలియజేయవలసి ఉంటుంది

జగనన్న ఆరోగ్య సురక్ష టైం లైన్స్ 

▶︎సెప్టెంబర్ 7న క్యాంపెయిన్ షెడ్యూల్ ను MPDO'S ద్వారా నిర్ణయించడం జరుగుతుంది 
▶︎స్టేట్ లెవెల్ మీటింగ్ సెప్టెంబర్ 8న నిర్వహించడం జరుగుతుంది 
▶︎ANM వారికి Department ట్రైనింగ్ మరియు వాలంటీర్లకు FOA'S ద్వారా ట్రైనింగ్ సెప్టెంబర్ 12వ తేదీ లోపు పూర్తి చేయడం జరుగుతుంది
▶︎జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సెప్టెంబర్ 15న ప్రారంభమగును 
▶︎జగనన్న ఆరోగ్య సురక్ష బ్రోచర్స్ సెప్టెంబర్ 20న పంపిణీ
▶︎జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు సెప్టెంబర్ 30న నిర్వహించబడును