Ysr Jalakala Eligibility Criteria👈

             వై.యస్.ఆర్ జలకళ - ఉచిత బోరుబావులు

 

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన  ప్రజాసంకల్పయాత్ర'

 పాదయాత్ర సందర్భంగా, వ్యవసాయానికి అవసరమైన నీటి కోసం బోరుబావులు

వేసుకోవడం తమకు తలకు మించిన భారం అవుతుందని రైతులు ఆయన దృష్టికి

 తీసుకువచ్చారు.  వారి బాధలను అర్ధం చేసుకొన్న గౌరవ ముఖ్యమంత్రి రైతుల ఆర్ధిక

 భారాన్ని తగ్గించడానికి,  అవసరమున్న వారందరికి ఉచిత బోరుబావులను తవ్వించి

 ఇస్తానని పాదయాత్ర సందర్భంగా  రైతులకు వాగ్దానం చేశారు. అందులో భాగంగానే

 సవరత్నాలలో ఉచిత బోరుబావులను చేర్చి, ప్రతి  ఎకరాకు నీటి సదుపాయాన్ని ఏర్పాటు

 చేస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసేందుకు  నవరత్నాలలో భాగంగా సిప్టెంబర్

 28న ఉచిత బోరుబావులు తవ్వకం కార్యక్రమం "వై.యస్.ఆర్.  జలకళ ను

 గౌరవ ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించనున్నారుదాదాపు రూ.2,340 కోట్ల వ్యయంతో

 రెండు లక్షల (2,00,000) బోరుబావులు తవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.

 ఈ పథకం ద్వారా దాదాపు సన్న  మధ్యకార  మూడు లక్షల రైతులు  (3,00,000) లబ్ది పొందుతారు. అలాగే మొత్తం ఐదు లక్షల ఎకరాలు (5,00,000) సాగులోకి వస్తాయి

 

మీషన్:

 

సుపరిపరిపాలన లో బాగంగా ప్రభుత్వ సేవలు ప్రజలకి చేరువ చేస్తూ వారి జీవన

ప్రమాణం పెంచడానికి " నవరత్నాలు " అను 9 సంక్షేమ కార్యక్రమములలో భాగముగా,

 "లభ్యమైన” భూగర్భ జల వనరులను వినియోగించి కొనుచూ - వై.యస్.ఆర్. రైతు భరోసా

 ఉచిత బోరుబావులు" అను పథకమును ప్రభుత్వం అమలు చేయబోతున్నది

 

 

లక్ష్యం:

రాష్ట్రం లోని సన్న/చిన్న కారు రైతులకు లభ్యమైన భూగర్భ జల వనరులను

వినియోగించు కొనుచూ వ్యవసాయ యోగ్యమైన ప్రతి చిన్న విస్తీర్ణమును భూగర్భ సర్వే

 చేసి, నీటి లభ్యతను నిర్ధారించి సాగు లోని తేవడం దీని లక్ష్యం.

 

 

అర్హత:

 

·  రైతుకు 5 ఎకరముల విస్తీర్ణము గల సాగు యోగ్యమైన భూమి ఉండి దానిలో ఇదివరకే బోరువేల్/టబ్ వెల్/ ఓపెన్ వెల్ ఉండకూడదు.

·  సదరు రైతుకు 2.5 ఎకరముల విస్తీర్ణము గల భూమి ఒకే చోట కలిగి ఉండాలి.

·  2.5 ఎకరముల విస్తీర్ణము గల భూమి ఒకే చోట లేనిచో, సదరు ఒకే చోట విస్తీర్ణము గల రైతులు గ్రూప్ గా ఏర్పడి దరఖాస్తు చేసుకొనవచ్చు.

·  ఇప్పటికే నోటిఫై చేయబడిన, భూగర్భ జలములను అతిగా వినియోగించిన ప్రాతములకు ఈ పథకము వర్తించబడదు.

 

 

 దరఖాస్తు చేసుకొను విధానం:

 

· అర్హత గల రైతు తన యొక్క అధార్ కార్డు మరియు పట్టాదారు పాసు పుస్తకము నఖలు తో ఆన్ లైన్/ గ్రామ సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

· సదరు దరఖాస్తు గ్రామ సెక్రటరీ క్షత్ర పరిశీలన/ వి.ఆర్.scrutiny తదుపరి MPDO కి పంపబడును.

· ఆ విధముగా అర్హత నిర్ధారించిన అన్ని దరఖాస్తులు తదుపరి చర్య నిమిత్తం MPDO నుండి PD, DWMA వారికి పంపబడును.

 

 

 

సాధ్యత:

 

 

· PD, DWMA కు చేరిన అర్హత కలిగిన దరఖాస్తులు అన్నియు సమగ్రమైన జియాలాజికల్  సర్వే నిమిత్తం సంబందిత నియోజిక వర్గ డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ కు పంపబడును.

· సదరు కాంట్రాక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంటు వద్ద రిజిస్టర్ చేయబడిన జియాలజిస్టుల సహకారంతో, రైతులు ధరఖాస్తు చేసుకొన్న భూములలో బోరుబావులు డ్రిల్ చేయుటకు సాధ్యము అయిన స్థలమును (Feasibility Point) నిర్థారింపచేయును.

· సదరు feasible points AP WALTA చట్టం పరిధికి లోబడి ఉండును.

· సదరు feasible paints మరియు జియాలాజికల్ సర్వే (భూగర్భ జల వనరుల

·  లభ్యతరిపోర్ట్స్, డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ వారి ద్వారా PD, DWMA కు పంపబడును.

· అవసరమైన సాంకేతిక సలహాలు డిప్యూటీ డైరెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంటు వారి వద్ద నుండి పొందవచ్చును.

 

 

 

పథకము మంజూరు:

 

 

·  డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ నుండి వచ్చిన లిస్టు ప్రాప్తికి feasible points ను ఆధారముగా చేసుకొని అర్హత గల లబ్దిదారులు లిస్టు PD, DWMA వారు తయారు చేయుదురు.

· అర్హత గల లబ్దిదారుల లిస్టు తో పాటు సంబందిత జియాలాజికల్ (భూగర్బ) సర్వే రిపోర్ట్స్  ను జత చేసి ఎస్టిమేట్స్ తయారు చేయు నిమిత్తం APD లకు PD, DWMA వారు నుండి  సదరు లిస్టు పంపబడును.

· ఎస్టిమేట్స్ తయారు చేసిన తదుపరి APD, సదరు లిస్టు ను పరిపాల ఆమోదము (Administrative Sanction) నీమీత్తం PD, DWMA వారికి తిరిగి పంపుదురు.

·  PD, DWMA, అర్హత గల లబ్ధిదారుల జాబితాను తయారు చేయబడిన ఎస్టిమేట్స్ తో కలిపి పరిపాల ఆమోదము (Administrative Sanction) నిమిత్తం శ్రీ జిల్లా కలెక్టర్ వారికి పంపుదురు.

· జిల్లా కలెక్టర్ వారు ఈ పథకమునకు అర్హత గల లబ్దిదారులకు పరిపాల ఆమోదము (Administrative Sanction) మంజూరు చేయుదురు.

 

 

అనుమతి పొందిన మంజురులను సంబంధిత స్థాయికి పంపుట :

 

 

· PD, DWMA గారు మంజూరు అయిన లబ్ధిదారుల జాబితాను APD లకు తెలియజేయుచూ MPDO ల ద్వారా గ్రామ సచివాలయమునకు పంపుదురు.

·  లబ్దిదారులకు బోరవెల్ మంజూరు అయిన విషయము "SMS" ద్వారా  తెలియజేయబాడును,

· PD, DWMA గారు మంజూరు అయిన లబ్ధిదారుల జాబితాను డ్రిల్లింగ్ ప్రారభించుటకు గాను నియోజక వర్గ డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ కు పంపుదురు.

 

 

బోరుబావులు డ్రిల్ చేయుట :

 

 

 

· అర్హత గల లబ్దిదారుల జాబితాను PD, DWMA వారి నుండి పొంది, నియోజిక వర్గ కాంట్రాక్టర్ నిర్ధారించుకొని, Inspection and yield Test కు సిబ్బందిని పంపమని APD వారిని కోరుతూ సిఫార్స్ చేయబడిన లొకేషన్స్ లో బోరుబావులు డీల్ చేయుదురు.

· బోరుబావి 900 "V" notch పద్ధతి ద్వారా 4,500 Liter Hour (1000GPH) నీటిని పంపు చేసినచో అది Successful గా పెరగణింపబడును.

·  డ్రిల్లింగ్ సమయం లో సంబంధిత అధికారుల సమక్షంలో మాత్రమె yield Test చేయవలెను. కనీస నీటి లభ్యత 900 "V" notch పద్ధతి ద్వారా గంటకు 4,500 Liters గా నిర్ధారించబడినది.

· బోరువేల్ డ్రిల్ చేయు సమయం లో కాంట్రాక్టర్ సమక్షం లో సంబంధిత అధికారి లబ్ధిదారునితో సహా బోరుబావినకు జియో ట్యాగ్ చేసి సంబందిత Digital Photo ను APD, DWMA వారికి అందచేయవలెను.

·  కాంట్రాక్టర్ మరియు లబ్దిదారుని సమక్షంలో సంబందిత అధికారి. త్రవ్వన మరియు కేసింగ్ వెయ్యబడిన బోరుబావుల లోతులను యం.బుక్ లో రికార్డు చేయుదురు.

· బోరువేల్ నిర్మాణం పూర్తీ అయిన తదుపరి సంబందిత అధికారిచే పూర్తీ అయిన పని వివరములు, సంబందిత ఫోటోలు, నిర్ణత డాకుమెంట్స్, లబ్దిదారుని సంతకముతో సహా సంబంధిత APD గారికి పంపబడును.

· పేమెంట్ చెల్లించుటకు ముందుగా, డ్రిల్ చేయబడిన బోరుబావులలో 10% బావులను సంబందిత APD సూపర్ చెక్ చేయవలెను.

· నిర్థారించ బడిన Success Criteria నీ బట్టి, క్షత్ర స్థాయి కొలతలు మరియు సంబందిత ఇన్ వాయిస్ లు సమర్పించిన తదుపరి చెల్లింపులు చేయబడును.

·  డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ అయిన కాంట్రాక్టు ప్రాప్తికి సంబందిత APD FTOS జనరేట్ చేయుదురు

· సంబందిత కాంట్రాక్టర్ మరియు లబ్దిదారుని సమక్షం లో డీల్ చేయబడిన అన్ని బోరు బావులు (success/fail అయిన) సంబందిత అధికారు తో జియో ట్యాగ్ (Geo Tag) చేయబడును.

· త్రవ్వబడిన బోరుబావి Fail అయినచో సంబందిత డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ తక్షణమే (వెంటనేసదరు ఫెయిల్ అయిన బోరుబావిని మెటీరియల్ తో కప్పివేయునట్లు APD భాద్యత వహించును.

 

డ్రిల్లింగ్ తదుపరి  చర్య :

 

 

· సంబందిత APD వారు డ్రిల్ చేయబడిన Success and failure బోరులు యొక్క లిస్టులు మరియు లొకేషన్స్ Bore well Completions Reports రూపం లో maintain చేయవలెను.

· Successful బోరుబావి వద్ద Recharge pit/water Harvesting pit ఖచితం గా నిర్మించ వలెను.

· ఈ పథకము ద్వారా డ్రిల్ చేయబడిన బోరు బావులకు సోషల్ ఆడిట్ నిర్వహించబడును.