YSR PENSION KANUKA TYPES ELIGIBILITY CRITERIA👈
ఫించన్ రకములు
· వితంతు పెన్షన్ వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండి ఆ పై వయస్సు కలిగినవారు
· భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేదా డెత్ సర్టిఫికెట్ కల్గి ఉండాలి
· వికలాంగుల పెన్షన్ శాతం 40% మరియు అంతకన్నా ఎక్కువ వికలత్వం కలిగి ఉన్నవారు మరియు
· ముక్యంగా సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్న వారు. వీరికి వయోపరిమితి లేదు
· చేనేత కార్మికుల పెన్షన్ వారి వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు.
చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కల్గినవారు
· కల్లు గీత కార్మికుల పింఛన్ వయస్సు పింఛన్ 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు.
ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కంపల్సరీ కలిగినవారు.
· ప్రభుత్యం మత్స్యకారుల పెన్షన్ కు వయస్సు 50 సంవత్సరములు మరియు ఆ పైన కలవారు.
మత్స్య శాఖ వారిచే ప్రతేక గుర్తింపు పత్రం కల్గినవారు
· హెచ్ఐవి బాధితులు పెన్షన్ దీనికి వయో పరిమితి లేదు.
ఆరు నెలలు వరుసగా యాంటీ రిట్రో వైరల్ థెరపీ వంటి తీసుకున్నవారు.
· డయాలసిస్ పెన్షన్వయస్సుతో సంబంధం లేకుండా మరియు ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు. ( స్టేజ్ 3, 4 5) వయో పరిమితి లేదు.
· ట్రాన్స్ జెండర్ పెన్షన్ 18 సంవత్సరాలు ఆ పైన గల వయస్సు కలవారు.
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం కంపల్సరీ కలిగినవారు.
· ఒంటరి మహిళ పెన్షన్ వయస్సు 35 సంవత్సరాలు ఫై మరియు ఆపైన కలిగి ఉండి, చట్ట ప్రకారం భర్త నుండి వారు విడాకులు పొందినవారు, భర్త నుండి విడిపోయిన వారు (విడిపోయిన కాలవ్యవధి ఒక సంవత్సరం పైగా వుండాలి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు, భర్త నుండి విడిపోయినట్లు గా ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేనివారు వారు గ్రామ / వార్డు స్థాయిలో ప్రభుత్వ అధికారుల సాక్షాలతో మీ తాసిల్దారుగారి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి.
· అవివాహితులుగా ఉండి ఎటువంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నవారు ఉన్న వారు, గ్రామాలలో ఉన్న వారికి వయస్సు 30 సంవత్సరములు మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి వయస్సు 35 సంవత్సరాలు, ఆపైన కల్గి ఉండాలి. పెన్షన్ మంజూరు అనంతరం వారు వివాహం చేసుకుని ఉన్నా లేదా ఆర్ధిక పరముగా జీవనోపాధి పొందిన వారు తక్షణమే పెన్షను నిలిపి వేసే బాధ్యత సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి వారికి అనుమతి ఉన్నది. (ప్రతి నెల పెన్షన్ పంపిణీ అధికారి ఆమె పరిస్థితి పరిశీలించాలి.)
· డప్పు కళాకారుల పెన్షన్ వయస్సు మాత్రం 50 సంవత్సరంలు మరియు ఆ పైన కలవారు.
కళాకారుల పెన్షన్ కు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా వారిచే గుర్తింపు పొందిన వారై ఉండవలెను
· చర్మకారుల పెన్షన్ వయసు 40 సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు.
లబ్ధిదారుల జాబితా అనేదీ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అందజేస్తుంది.
· అభయ హస్తం పెన్షన్ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలోఉండి వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉండి, 60 సంవత్సరాల వయస్సు కలవారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్ ఈ వెబ్సైట్ నందు వైయస్సార్ పెన్షన్ కానుక సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వెబ్ సైట్ నందు గవర్నమెంట్ ఉంచడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ ప్రతి నెల ఎంత అమౌంట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఎంత అమౌంట్ అనేది వాలంటీర్స్ పెన్షన్ పంపిణి చేసారు , మిగిలిన అమౌంట్ ఎంత, జిల్లాల వారీగా పెన్షన్ కానుక స్టేటస్ అనేది మీరే తెలుసుకోవచ్చును. ఒకవేళ గవర్నమెంటు కొత్త పెన్షన్స్ రిలీజ్ చేసినా కానీ ఆ పెన్షన్ వివరాలు కూడా మీరె స్వయంగా ఈ వెబ్ సైట్ నందు గవర్నమెంట్ అప్డేట్ చేయడం జరుగుతుంది.కాబట్టి పెన్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక వెబ్ సైట్ నందు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే లాగా విధంగా గవర్నమెంట్ అప్డేట్ చేయడం జరిగింది.
ఈ వైఎస్సార్ పెన్షన్ కానుక వెబ్సైట్ అనేది చూడటానికి కంప్యూటర్ ఉండవలసిన అవసరం లేదు మనము ఎటువంటి డబ్బులు అనేది ఖర్చు చేయకుండానే మన మొబైల్ లోనే సింపుల్ గా అయితే స్టేటస్ అనేది తెలుసుకోవచ్చును. చాలా మంది తెలియక వారు బయట కంప్యూటర్ సెంటర్స్ లో అమౌంట్ పే చేసి స్టేటస్ అనేది తెలుసుకుంటున్నారు అందుకని అలా అమౌంట్ అనేది ఎవరు చెల్లింపు చేయకుండా సింపుల్ గా మన మొబైల్ లోనే మన స్టేటస్ అన్ని తెలుసుకవచ్చును.
అర్హతలు
· పట్టణ ప్రాంతంలో నిర్మాణ స్థలం మొత్తం 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి.
· కుటుంబంలో మొత్తం ఏ ఒక్కరు ఆదాయ పన్ను(ఇన్ ట్యాక్స్ ) చెల్లించే పరిధిలో ఉండకూడదు .
· కుటుంబం మొత్తానికి వైట్ బోర్డు నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. (ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ మినహాయింపులు)
· మొత్తం కుటుంబానికి మూడు ఎకరాల మాగాణి తరి భూమి లేదా పదిఎకరాల మెట్ట లేదా మా గాని మరియు మెట్ట భూములు రెండు కలిపి పది ఎకరాల మించరాదు
· మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు 10,000 మరియు పట్టణ ప్రాంతాలలో అయితే 12 వేల కంటే తక్కువ అయ్యి ఉండాలి
· సాధారణంగా ఒక కుటుంబానికి ఒక పెన్షన్ మాత్రమే (40 % మరియు ఆ పైన అంగవైకల్యం కలవారు మరియు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు మినహాయింపు).
· కుటుంబం నివసిస్తున్న గృహం యొక్క నెలవారి విద్యుత్ వినియోగం బిలో 300 యూనిట్ల లోపు వాడి ఉండవలెను.
· కుటుంబంలో మొత్తం ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్దారుడు వుండరాదు.